ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ.. ఎప్పుడూ ప్రభుత్వాలతో పోరాటాలే కాని, ప్రభుత్వాలని ప్రశంసించటం చాలా అరుదు. ఎప్పుడూ ప్రభుత్వాలని ఎదో ఒక సందర్భంలో తిడుతూనే ఉంటారు. అలాంటి సిపిఐ నాయకులు ఇప్పుడు ప్రభుత్వాన్ని పొగిడారు. ఏకంగా ముఖ్యమంత్రి కొడుకుకే ప్రశంసలు అందించారు. లేఖ రాసి మరీ, ధన్యవాదాలు చెప్పారు. మంచి చేస్తే, శత్రువు అయినా పొగుడుతారు అనేదానికి ఇదే ఒక ఉదాహరణ... కర్నూలు జిల్లాలోని తమ స్వంత గ్రామానికి సంబంధించిన రోడ్ల నిర్మాణం కొరకు గ్రామస్థులు కోరిన వెంటనే స్పందించి నిధులు విడుదల చేసిన పంచాయితీరాజ్‌ శాఖా మంత్రి నారా లోకేష్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధన్యవాదాలు తెలియజేస్తూ లేఖ రాశారు.

ramkrishna 24062018 2

కర్నూలు జిల్లాలోని రెండు పెద్ద గ్రామాలైన మద్దికెర – మొలగవల్లి గ్రామాల మధ్య గతంలో వర్షాల కారణంగా రోడ్డు మధ్యలో కూలిపోయిన బ్రిడ్జి నిర్మాణానికిగాను రు.3.75 కోట్లు, ఆలూరు మండలంలోని మొలగవల్లి – చిప్పగిరి మండలంలోని నేమకల్లు గ్రామాల మధ్య దెబ్బతిన్న 10 కిలోమీటర్ల రోడ్డు పునర్నిర్మాణానికిగాను రు.8.25 కోట్లు, మొలగవల్లి గ్రామ బస్టాండ్‌ నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు సిమెంట్‌ రోడ్డు నిర్మాణానికి రు.70 లక్షలు నిధులు కేటాయించారు. మీకు ధన్యవాదాలు. అలాగే మా స్వగ్రామము కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లి గ్రామ రైల్వేస్టేషన్‌ నుండి హోసూరు గ్రామం వరకు రోడ్డు నిర్మాణం చేయవలసి ఉన్నది. ఈ రోడ్డు నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేయాలని రామకృష్ణ ఆ లేఖలో కోరారు.

ramkrishna 24062018 3

రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ 'చంద్రన్న బాట' పేరిట రాష్ట్రంలోని అన్ని పంచాయితీలలో వాడవాడలా సిమెంటు రోడ్లు వేయించారు. రూ.1485 కోట్ల ఉపాధిహామీ మరియు ఆర్థిక సంఘం నిధులతో ఒక్క ఏడాదిలోనే గ్రామాల్లో 7,000 కిలోమీటర్ల అంతర్గత రహదారులను నిర్మించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు సిమెంట్ రోడ్ల నిర్మాణాలు పూర్తిచేయడానికి అధికారం యంత్రాంగం రాత్రింబవళ్లు కృషి చేస్తోంది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోనూ సీసీ రోడ్లు నిర్మించాలన్న ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకుంటూ వాడవాడలా చంద్రన్నబాట కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం పై, అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇప్పుడు ఏకంగా, ప్రతిపక్ష పార్టీ నాయకుడే మెచ్చుకోవటం, ప్రభుత్వ పని తీరుకు నిదర్శనం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read