పోలవరం ప్రాజెక్టు సత్వరం పూర్తి చేసేందుకు తక్షణం నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. పోలవరం నిర్మాణం కోసం ఖర్చు చేసిన వాటిలో రూ. 1,504.14 కోట్లు ఇవ్వాలని, అలాగే నూతన అంచనాలకు త్వరగా ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి తన లేఖలో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధుల విడుదలలో కేంద్రం ఆలస్యం చేయడం లేదని బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలను తప్పుబట్టారు. సోమవారం సచివాలయంలో పోలవరం సహా 54 ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జలవనరుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ లేఖ రాయటానికి ప్రధాన కారణం, నిన్నటి నుంచి పోలవరం పై, బీజేపీ నేతలు, జీవీఎల్ లాంటి వారు చేస్తున్న ప్రచారం. పోలవరం ప్రాజెక్ట్ కు, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది అంతా ఇచ్చేసాము అంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. జీవీఎల్ లాంటి వారు, ఎదో చెప్పిస్తూ ప్రజలను, అదే నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. పోలవరం డబ్బులు అన్నీ ఇచ్చేసామని, పోలవరంను ఏపీ ప్రభుత్వం అక్షయపాత్రలా భావిస్తోందని, ప్రాజెక్టు విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని, ఇలా ఇష్టం వచ్చినట్టు నిన్నటి నుంచి మాట్లాడుతున్నారు. ఈ తాడు బొంగరం లేని, జీవీఎల్ ఇలాంటి ప్రచారం చెయ్యటంతో, వీటికి చెక్ పెట్టటానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది.
ఏకంగా ముఖ్యమంత్రి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. పోలవరం నిర్మాణం కోసం ఖర్చు చేసిన వాటిలో రూ. 1,504.14 కోట్లు ఇవ్వాలని, తొందరగా వచ్చేలా చూడాలని అన్నారు. ఇప్పుడు జీవీఎల్ చెప్పే సొల్లు కబురులు నిజం అయితే, ఇదే విషయం నితిన్ గడ్కరీ లేఖలో ముఖ్యమంత్రికి రాయాలి. మేము అన్ని డబ్బులు ఇచ్చేసాం, మీరు అవినీతి చేస్తున్నారు అని, నితిన్ గడ్కరీ లేఖ రూపంలో చెప్పగలరా ? ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రి. ఈ తాడు బొంగరం లేని జీవీఎల్ లాంటి నేతలు చెప్పేవి నిజం అయితే, కేంద్ర మంత్రి, అదే విషయం ఆ లేఖలో రాయాలి. లేకపోతే జీవీఎల్ చెప్పేవి అన్నీ అబద్ధాలే అని, మరోసారి రుజువు అవుతుంది. జీవీఎల్ చెప్పేవి నిజాలు అయితే, ఆయనే నితిన్ గడ్కరీతో మాట్లాడి, చంద్రబాబుకు మీరు అవినీతి చేస్తున్నారు అని లేఖ రాపించాలి.. లేకపోతే, ఆ అరకోటులు వేసుకుని, ఢిల్లీలోనే భజన చేసుకోవాలి..