బీజేపీ, జగన్, పవన్, గవర్నర్, కెసిఆర్, ఐవైఆర్, ముద్రగడ, మోత్కుపల్లి, పోసాని, రమణ దీక్షితులు, ఇలా అందరి టార్గెట్ ఒక్కటే... చంద్రబాబును ఇబ్బంది పెట్టాలి, రాష్ట్రంలో అనిశ్చితి రావాలి, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవాలి... ఈ ఆపరేషన్ కు పేరే, ఆపరేషన్ గరుడ అని ప్రచారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా ఇదే ఆరోపిస్తుంది. జర్గుతున్న పరిణామాలు కూడా ఇవే నిజం అని చెప్తున్నాయి.. అయితే, చంద్రబాబుని ఇబ్బంది పెట్టటమే లక్ష్యంగా చేస్తున్న పరిణామాలు వేగవంతం అయ్యాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, చంద్రబాబు లక్ష్యంగా బీజేపీ పావులు కదపడం వేగవంతం చేసింది. దీని కోసం, వేదికగా ఢిల్లీని ఎంచుకున్నారు. గత నాలుగు రోజులుగా ఢిల్లీలో, పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఇందుకోసం కెసిఆర్, గవర్నర్ ను కూడా ఢిల్లీ రప్పించారు. వైసిపీ ఎమ్మల్యే, బీజేపీ ఎమ్మల్యే , రాం మాధవ్ ఇంట్లో సమావేశం అయినట్టు, ఆధారాలు కూడా బయటకు వచ్చాయి. చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో గట్టిగా దెబ్బతీసేందుకు అవసరమైన సమాచారాన్ని సేకరించి, వ్యూహరచన చేస్తున్నారు. ఇందు కోసం, ముందుగా, చంద్రబాబుని, జగన్ స్థాయికి తీసుకు వచ్చే ప్లాన్ వేసారు. జగన్ లాగే, చంద్రబాబు కూడా అవినీతి పరుడు అని చిత్రీకరించాలని, గత నాలుగు నెలలుగా ప్రయత్నం చేస్తున్నా, ఒక్కటంటే, ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఇలా చేస్తేనే, చంద్రబాబుని ఎదుర్కోవటం తేలిక అని, ప్రజల్లో చంద్రబాబు పట్ల నెగటివ్ ఫీలింగ్ తెప్పిస్తేనే, తరువాత అడుగు వెయ్యగలమని, అందుకే ఎలాగైనా, చంద్రబాబు పై అవినీతి మరక వెయ్యటానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు.
ఆధారాలు లేకపోయినా, కోర్ట్ లో కేసు వేసి, విచారణ వరకు తీసుకు వచ్చినా చాలని, అందుకోసం ప్లాన్ సిద్ధం చెయ్యటానికి, గత నాలుగు రోజులుగా అందరూ కలిసి, కుట్రలు పన్నుతున్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, ఆకుల సత్యనారాయణ, నాలుగు రోజలుగా రాం మాధవ్ ను కలుస్తూనే ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ బుధవారం ప్రధాని మోదీని కూడా కలుసుకున్నారు. ఆ తర్వాత, ఆకుల సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కలిసారు. నిన్న గవర్నర్, కెసిఆర్ కూడా వెళ్లి కలిసారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీని ఏ విధంగా దెబ్బ తీయాలన్నదే ప్రధాని, బీజేపీ నేతల ఆకాంక్షగా కనబడుతోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు, తెలుగుదేశం నేతలపై ముప్పేట దాడికి కేంద్రం పథకం పన్నుతోందని, అందుకోసమే అన్ని వర్గాల నుంచి సమాచారం సేకరించి, చక్రం తిప్పేందుకు సిద్ధమవుతోందని ఈ వర్గాలు అంటున్నాయి. తెలుగుదేశం వర్గాలు మాత్రం, ఢిల్లీ నుంచి వచ్చే ఎలాంటి కుట్రలు అయినా ఎదుర్కుంటామని, ఇలాంటి కుట్రలు మాకు కొత్త కాదని అంటున్నారు.