ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి తెలిసిన వారు, చంద్రబాబు నైజం గురించి తెలియని వారు ఉండరు. చాలా తక్కువ సందర్భాల్లో చంద్రబాబు సహనం కోల్పోతారు. ఇక అసెంబ్లీలో అయితే చంద్రబాబు ఎప్పుడూ నిరసన తెలపలేదు. ఎమ్మెల్యేలు నిరసన చేస్తారు కానీ, ఎప్పుడూ చంద్రబాబు నిరసన తెలపలేదు. అయితే చరిత్రలో మొదటిసారి చంద్రబాబు అసెంబ్లీలో నిరసన తెలిపారు. రైతులు తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టం జరిగిందని, దాని పై తనకు మాట్లాడే అవకాసం ఇవ్వాలని, రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారి సమస్యలు ప్రభుత్వ దృష్టికి తేవాలని చంద్రబాబు కోరినా, ఆయనకు మాట్లాడే అవకాసం ఇవ్వలేదు. దీంతో చంద్రబాబు రైతుల కష్టాల గురించి ప్రభుత్వానికి చెప్పాలని, రైతులు ఎదుర్కుంటున్న ఇబ్బందులు చెప్పాలని, అవకాసం ఇవ్వాలని చెప్పినా , ఇవ్వకపోవటంతో, రైతుల తరుపున చంద్రబాబు స్పీకర్ ముందు బైఠాయించారు. ముందుగా కన్నబాబు తమ ప్రభుత్వం ఇది చేసింది , అది చేసింది, తమ ప్రభుత్వంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు, రైతులు తమ ప్రభుత్వం పై సంతోషంగా ఉన్నారని, మంత్రి చెప్పారు. అయితే మంత్రి సమాధానం పై నిమ్మల రామానాయుడు స్పందిస్తూ, రైతులు ఎదుర్కుంటున్న ఇబ్బందులు గురించి చెప్తూ ఉండగా, జగన్ మోహన్ రెడ్డి కల్పించుకుని, నిమ్మల రామానాయడుకు కౌంటర్ ఇచ్చారు.
అయితే జగన్ సమాధానం పై చంద్రబాబు, తనకు మాట్లాడే అవకాసం ఇవ్వాలని కోరారు. రైతులు ఎదుర్కుంటున్న ఇబ్బందులు గురించి తమకు మాట్లాడే అవకాసం ఇవ్వాలని కోరగా, అవకశం ఇవ్వలేదు. స్పీకర్ కు చంద్రబాబుకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అయితే ఈ సందర్భంలో జోక్యం చేసుకున్న జగన్ మోహన్ రెడ్డి, నిమ్మల రామానాయడుకి సమాధానం ఇచ్చాం కాబట్టి, ఆయనే మాట్లాడాలని, చంద్రబాబుకి మాట్లాడే అవకాసం ఎలా ఇస్తాం అంటూ ఆయనకు ఇవ్వటానికి వీలు లేదని జగన్ అన్నారు. దీంతో రైతుల తరుపున మాట్లాడే అవకాసం ఇవ్వకపోవటంతో, చంద్రబాబు స్వయంగా అసెంబ్లీ స్పీకర్ ముందు కింద కూర్చుని , నిరసన తెలిపారు. తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని, రైతుల కష్టాల గురించి, మాట్లాడే అవకాసం ఇవ్వాలని నిరసన తెలిపారు. అయితే ఆయానకు మాట్లాడే అవకాసం ఇవ్వకూడదు అని, అది సాంప్రదాయం కాదని, తాము ఇంకా బిజినెస్ చేసుకోవాలని, వారిని సభ నుంచి సస్పెండ్ చేయాలనీ, జగన్ కోరారు. దీంతో రైతులు సమస్యల పై ప్రతిపక్షం మాట్లాడకుండానే అందరినీ సస్పెండ్ చేసారు.