విభజన హామీలు అమలు, కోసం జనవరి నెల నుంచి చంద్రబ్బు పోరాటాన్ని ఉధృతం చేసారు. ఓ వైపు ప్రధాని మోదీ మోసాన్ని, మరోవైపు కేంద్రం చేసిన అన్యాయాన్ని ఎండగడుతూ ఢిల్లీపై యుద్ధమే ప్రకటించారు. ఇంకోవైపు టీడీపీకి రాజకీయంగా కూడా ఆ పార్టీకి జాతీయస్ధాయిలో మద్దతు పెరుగుతూ వస్తోంది. ఈ పరిణామాల మధ్య టీడీపీని ఒంటరి చేసి, చంద్రబాబును ఏకాకి చేసేందుకు విపక్ష వైసీపీ ఎన్ని చేయాలో అన్నీ చేస్తోందనే ఆరోపణలొస్తున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు వ్యతిరేకులందరినీ వైసీపీ కలుస్తోందనే విమర్శలొస్తున్నాయి. ఢిల్లీ పీఎంఓలో ప్రధానిని కలిసినప్పటి నుంచి నిన్నటి మోత్కుపల్లి నరసింహులు భేటీ వరకు ఎంపీ విజయసాయిరెడ్డి ఒకటే ఎజెండాగా పనిచేస్తున్నారు. అంతేకాదు చంద్రబాబును బోనులో నిలబెట్టడమే తమ లక్ష్యమని అసలు ఉద్దేశాన్ని చెప్పేశారు ఆయన.
ఇటు చంద్రబాబుపై తీవ్ర విమర్శలతో టీడీపీ నుంచి బహిష్కరణకు గురయిన మోత్కుపల్లితో విజయసాయి భేటీ అయ్యారు. చంద్రబాబును గద్దెదింపడమే ఉమ్మడి లక్ష్యమని వీరిద్దరు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా అన్నీ పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. మరోవైపు తిరుమల శ్రీవారి ఆభరణాల లెక్కల్లో అవకతవకలు, కొండపై అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేసిన రమణదీక్షితులు కూడా జగన్‌ను కలిశారు. మిరాశి వ్యవస్ధను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని అందుకే ఆయన్ను కలిశానని దీక్షితులు చెప్పుకొచ్చారు. అంతేకాదు జగన్ న్యాయం చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతకు ముందు దీక్షితులు ఢిల్లీ వెళ్లి అమిత్‌షాతో పాటు మరికొందరిని కలిసిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. కొండమీద జరిగే అన్యాయాలను చెప్పేందుకే వాళ్లను కలిశానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయంలో న్యాయపోరాటానికి సిధ్దమని ప్రకటించారు. ఆపరేషన్ గరుడలో భాగంగానే దీక్షితులను బీజేపీ ప్రయోగించిందని, మతవిధ్వేషాలు రెచ్చగొట్టి, వెంకన్న మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కలిసి బీజేపీ నేత రాంమాధవ్‌తో భేటీ అవ్వడం రాజకీయంగా సంచలనం సృష్టించింది.