ఢిల్లీలో బీజేపీ పెద్దలతో వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి భేటీ కావడం రెండుపార్టీల కుట్రలకు పరాకాష్ట అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. శుక్రవారం ఎంపీలతో, మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ప్రధానంగా ఈనెల 17న జరగనున్న నీతి అయోగ్ సమావేశం, ఏపీకి జరిగిన అన్యాయం, కుట్ర రాజకీయాలపై చర్చించినట్లు తెలియవచ్చింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పీఎంవోలో విజయసాయిరెడ్డి తిష్ట వేయడంపై గతంలో ఫొటోలు వచ్చాయని, ఇప్పుడు ఢిల్లీలో బుగ్గన, ఆకులతో కలిసివెళ్లడంపై వీడియోలు వచ్చాయన్నారు. గతంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో.. బీజేపీకి అడగకుండానే వైసీపీ బేషరతుగా మద్దతిచ్చిందని చంద్రబాబు విమర్శించారు.

cbn 15062018 2

దిల్లీ వెళ్లి భాజాపా పెద్దలతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ కావడం.. వైకాపా, భాజపా కుట్రలకు పరాకాష్ట అని చంద్రబాబు అన్నారు. సీఎంవోలో విజయ్‌సాయిరెడ్డి తిష్టవేయడంపై గతంలో ఫోటోలు వచ్చాయని, ఇప్పుడు దిల్లీలో బుగ్గన, ఆకులతో కలిసి వెళ్లడంపై వీడియోలు కూడా వచ్చాయని అన్నారు. గతంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భాజాపా అడక్కుండానే వైకాపా భేషరతుగా మద్దతు పలకడాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బీజేపీని జగన్‌ ఎందుకు నిలదీయడంలేదని, ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించడంలేదని చంద్రబాబు ప్రశ్నించారు. రెండు పార్టీల కుట్ర రాజకీయాలకు ఇంతకన్నా రుజువులు ఏం కావాలని ఆయన అన్నారు. బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్ కుట్ర రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు చంద్రబాబు సూచించారు

cbn 15062018 3

ఎంపీలు అన్ని జిల్లాల్లో వారానికో కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పొత్తుతో సాధించలేనిది, పోరాటంతో సాధించాలని పిలుపునిచ్చారు. పోరాటంలో ప్రతి నిమిషం అమూల్యమన్న చంద్రబాబు.. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఏమరపాటు తగదని దిశానిర్దేశం చేశారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన 350కోట్ల రూపాయలు వెనక్కి తీసుకోవడంపై కేంద్రాన్ని నిలదీయాలని చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలలో జాప్యాన్ని నిరసించాలని సూచించారు. రాజధాని అమరావతికి నిధులు విడుదలయ్యేలా ఒత్తిడి చేయాలన్నారు. చట్టంలో 18అంశాలు, 6 హామీలు నెరవేర్చేదాకా పోరాడాలన్నారు. ఎన్టీఆర్‌తో పెట్టుకుని ఇందిరాగాంధీ చేతులు కాల్చుకున్నారని.. కుట్ర రాజకీయాలను ఎదుర్కోవడం తెదేపాకి కొత్తేమీ కాదన్నారు. ఏడాది బిడ్డగా ఉన్నప్పుడే ఇందిర కుట్రలను సమర్ధంగా ఎదుర్కొన్నామని ఇప్పుడు భాజాపా కుట్రలను కూడా అదే స్ఫూర్తితో అధిగమిస్తామన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read