అసలు సర్కారీ బడి అంటే ఎలా ఉంటుంది...మొండిగోడలు...పెచ్చులూడే భవనాలు...అరకొర సదుపాయాలు...వసతుల లేమి...ఉపాధ్యాయుల లేమి...ఇవీ సాధారణంగా ఏ ప్రభుత్వ పాఠశాలను చూసినా కనిపించే సమస్యలు...కానీ వీటన్నింటికీ భిన్నంగా ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలలు నెమ్మదిగా, సకల సౌకర్యాలతో...సమస్త సదుపాయాలతో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలుగా మారుతున్నాయి... ఇప్పటికే డిజిటల్ తరగతులతో ఒక విప్లవం సృష్టించిన ప్రభుత్వం, ఆ ఫలితాలతో, పిల్లలకు మంచి మార్కులు వచ్చేలా కూడా చేస్తుంది.. దీంతో సామాన్య ప్రజలకు కూడా ప్రైవేటు స్కూల్స్ కాకుండా, మళ్ళీ ప్రభుత్వ స్కూల్స్ వైపు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు.. ప్రైవేటు స్కూల్స్ దీటుగా, మేము కూడా చదువు చెప్తున్నాం అంటూ, ప్రభుత్వ స్కూల్స్ కూడా ప్రచారం చేస్తున్నాయి.
మొన్న వచ్చిన భారత్ అనే నేను సినిమాలో ఒక సీన్ లో, మన రాష్ట్రంలో రెండు సంఘటనలు జరిగాయి.. చంద్రబాబు పాలనలో ఇదీ జరుగుతున్న రియాలిటీ... ఆ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలకు ఉన్నవి 80 సీట్లు.. చేరాలని ఆసక్తి చూపుతున్న విద్యార్థులు 180 మంది! అలాగని ఇదేదో కార్పొరేట్ పాఠశాల కాదు.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపాల్టీ పరిధిలోని లక్ష్మీన గర్ ఉన్నత పాఠశాల. అంతలా ఉంది ఇక్కడ అడ్మి షన్ల డిమాండ్. ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్ధులు పదో తరగతి 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. సుమారు 26 మంది విద్యార్థులు పదికి పది పాయింట్లు సాధించారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులుండడం, కేరీర్ ఫౌండేషన్ కోర్సులు అందిస్తుండడమే ఈ డిమాండ్ కు కారణం. మంగళవారం ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నామని ఉపాధ్యా యులు చెప్పడంతో పెద్దఎత్తున తల్లిదండ్రులు పిల్లలతో అక్కడకు చేరుకోవడంతో సందడి నెలకొంది.
180 మందికి ప్రవేశాలు కల్పించే అవకాశం లేకపో వడంతో విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ప్రవేశాలు కల్పించాల్సి వచ్చింది.. మరో పక్క చీరాలలో కూడా ఇదే పరిస్థితి. అక్కడ బడికి పరిమితి వెయ్యి సీట్లు. ఇప్పటికే 1472 దరఖాస్తులు వచ్చయి. దీంతో ఇక దరఖాస్తులు తీసుకోవటం ఆపేశారు. ఆదర్శవంతమైన ప్రణాలికలు, వినూత్న ప్రచారం ఆ బడిని తల్లిదండ్రులకు చేరువ చేసాయి. స్థానికంగా ఉన్న దాదాపు తొమ్మిది ప్రైవేటు స్కూల్స్ లోని పలువురు విధ్యార్ధులు ఇక్కడ చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చీరాల పట్టణం సమీపంలోని కొత్త పేటలో నిర్మిస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత స్కూల్ వైభవం ఇది. ఎకరాకి పైగా విస్తీర్ణంలో ఈ స్కూల్ నిర్మాణం జరుగుతుంది. ఈ నెల 18న నారా లోకేష్ ఈ స్కూల్ ప్రారంభం చెయ్యనున్నారు. విద్యార్ధులకు డైనింగ్ హాల్, పది రకాల ఆటలు ఆడేలా వివిధ రకాల కోర్ట్ లు, నెలకి ఒకసారి వైద్య పరీక్షలు ఇక్కడ ప్రత్యేకత..