రాష్ట్రంలో ఎన్నికలను ఎప్పుడు నిర్వహించినా తెలుగుదేశం పార్టీదే విజయమని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విపక్షాల నిందలను తిప్పికొట్టాలని, నిరంతరం అప్రమత్తంగా వుండాలని కేడర్‌కు పిలుపు నిచ్చారు. మంగళవారం ఉండవల్లిలోని గ్రీవెన్స్‌ సెల్‌లో జరిగిన తెెలుగుదేశం పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ భేటీలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంవత్సరం కావడంతో ఇక నుంచి పార్టీ కేడర్‌ ప్రజలతో మమేకం కావల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పారు. నాలుగేళ్ళలో చరిత్రలో నిలిచి పోయే పనులు చేశామని పేర్కొన్నారు. 16,707 కోట్ల రూపా యల విలువైన ఇళ్ళ పట్టాల పంపిణీ జరిగిందన్నారు. కేడర్‌ ప్రతి ఇంటినీ సందర్శించడంతో పాటు ప్రతి కుటుంబాన్ని పలకరించాలని నిర్దేశించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమ స్యలను తెలుసుకోవడంతో పాటు టీడీపీ నేతలు నిరంతరం ప్రజలలో వుండాలని, అప్పడే ప్రభుత్వం పట్ల పాజిటివ్‌ వాతావరణం ఏర్పడుతుందన్నారు.

cbn 27062018 2

వచ్చే ఎనిమిది నెలల కాలంలో రాష్ట్రంలో ఖాళీగా వున్న ఉద్యోగాలకు నోటిఫికే షన్లు వెలువడుతాయని వెల్లడించారు. మొత్తం 20 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని సంకల్పించినట్టు ప్రకటిం చారు. రాబోయే నాలుగు నెలల కాలంలో మరో 5.763 కోట్ల విలువైన నివేశన స్థలాలకు పట్టాలు ఇవ్వాలని, ప్రైవేటు భూములను కొనుగోలు చేసి పట్టాలు ఇచ్చేందుకు రూ. 500 కోట్లు మంజూరు చేశామన్నారు. విఆర్‌ఏలు, హోం గార్డులు, అంగన్‌వాడి ఉద్యోగులకు వేతనాలు పెంచామని, వీటిని ప్రజలలో బలంగా తీసుకువెళ్ళాలని అన్నారు. పైసా అవినీతి లేకుండా ఇళ్ళ స్థలాలు, పెన్షన్లు, రేషన్‌ కార్డులు,పెళ్ళికానుక, చంద్రన్న బీమా, విద్యార్థులకు ఫీజులు వంటి పథకాల ద్వారా ప్రజలకు వెసులుబాటు కల్పించామని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కార్యకర్తలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో విజయం సాధిం చామని, ఈ ప్రక్రియను ఇకనుంచి నిరాఘాటంగా కొనసా గించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. జులై 16నాటికి ప్రభుత్వం ఏర్పడి 1500 రోజులు అవుతుందని గుర్తుచేశారు. దీంతో పలు కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపు నిచ్చారు.

cbn 27062018 3

జులై 16 నుంచి జనవరి 10 దాకా షెడ్యూల్‌ ప్రకారం టీడీపీ కార్య క్రమాలు జరగాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. అదే రోజు గ్రామదర్శిని కార్య క్రమానికి శ్రీకారం చుట్టడం జరుగు తుందని తెలిపారు. నాలుగు నెలల కాలంలో 75 రోజులు గ్రామ దర్శిని కింద గ్రామ సభలు నిర్వహించాలని చంద్ర బాబునాయుడు తెలియజేశారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం పట్ల అనుసరిస్తున్న వైఖరిపై కొనసాగుతున్న ధర్మపోరాటం యధావిధిగా కొనసాగుతుందని చెబుతూ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతర పథకాలకు సంబంధించి నిధుల విడుదల విషయంలో అనుసరిసున్న వైఖరిని ఎండగట్టారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబునాయుడు హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడేవారిని అరెస్టు చేస్తామని, వారిని అరెస్టు చేసి జైలుకు కూడా పంపుతామని హెచ్చరించారు. పలువురు నిరుద్యోగులను మోసం చేస్తూ వసూళ్ళకు పాల్పడుతున్నవారి పట్ల అప్రమత్తంగా వుండాల్సిందిగా హెచ్చరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read