కేంద్ర బడ్జెట్ లో జరిగిన అన్యాయం పై గత రెండు నెలలుగా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలిసిందే... కేంద్ర బడ్జెట్ లో అన్యాయం పై, చివరకు మిత్రపక్షం అయిన తెలుగుదేశం కూడా, కేంద్ర క్యాబినెట్ నుంచి బయటకు వచ్చింది.. ఎన్డీఏలో కొనసాగుతూ, బీజేపీని ఇబ్బంది పెడుతుంది... ఎన్డీఏ నుంచి కూడా త్వరలో బయటకు రానుంది... ప్రతి రోజు అసెంబ్లీలో చంద్రబాబు , డైరెక్ట్ గా కేంద్రాన్ని, మోడీని నిందిస్తూ, వారు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తున్నారు... ఇంత జరుగుతున్నా, ఇన్ని ఆందోళనలు రాష్ట్రంలో జరుగుతున్నా, కేంద్రం మాత్రం ఏ మాత్రం స్పందించటం లేదు...
ఈ నేపధ్యంలో కేంద్రం పై, మరో ఒత్తిడి పెంచే వుహ్యంలో భాగంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదిపింది... కేంద్ర బడ్జెట్‌కు ఎంపీ గల్లా జయదేవ్ కీలక సవరణలు ప్రతిపాదించారు. ఆర్థిక బిల్లులోని క్లాజ్ 1 ఆఫ్ 2ని ఏపీకి వర్తింపజేయాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. ఏపీకి నిధుల కోసం ఆర్థికబిల్లులో కొత్త చాప్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు బుంధేల్ఖండ్ తరహా ప్యాకేజి ఇవ్వాలని కూడా ఆ ప్రతిపాదనలో ఉంది..
పోలవరం నిర్మాణంలో 2017 అంచనాల ప్రకారం ఆర్అండ్ఆర్ ప్యాకేజికి నిధులు కేటాయించేలా సెక్షన్ 90లో సవరణ చేయాలని విజ్ఞప్తి చేశారు. 13వ షెడ్యూల్లో కూడా పలు కీలక మార్పులు చేపట్టేలా సవరణలు జరగాలని సూచించారు. అమరావతి నిర్మాణానికి రూ.10 వేల కోట్ల చొప్పున ఐదేళ్లపాటు అందించేలా సెక్షన్ 94 ఆఫ్ 3లో సవరణలు చేపట్టాలని, ఏపీకి ఎఫ్ఆర్బీఎం పరిమితి కూడా పెంచాలంటూ జయదేవ్ ప్రతిపాదించారు. ఇవన్నీ చట్టంలో పెట్టిన అంశాలు... ప్రత్యేక హోదా లాగా, నోటి మాట కాదు.. దీంతో ఇప్పుడు, కేంద్రం ఎలా స్పందిస్తుంది అనే దాని పై ఆసక్తి నెలకొంది... తెలుగుదేశం కూడా మిగతా పక్షాలని ఏకం చేసి, ఈ ప్రతిపాదన పై మెజారిటీ సభ్యుల అంగీకారం తెచ్చుకోగలిగితే, అది బీజేపీకి పెద్ద దెబ్బ అవుతుంది... మరి ఈ విషయంలో, చంద్రబాబు ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి...