నిన్న పవన్ కల్యాణ్‌ మాట్లాడిన మాటల పై చంద్రబాబు స్పందించారు... పవన్ కల్యాణ్‌ పై ఎవరూ వ్యక్తిగత విమర్శలు చేయవద్దని, ప్రతి దానికి సరైన రీతిలో, మనం చేస్తున్న పనులు ముందు పెట్టి పవన్ కు సమాధానం చెప్పమని, టీడీపీ శ్రేణులకు చంద్రబాబునాయుడు చెప్పారు... గురువారం ఆయన ఎంపీలు, అసెంబ్లీ వ్యూహ కమిటీ ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు... మన విమర్శలు హుందాగానే ఉండాలన్నారు. ఎవరు నన్ను తిట్టినా, తిట్టించినా అవి నాకు ఆశీర్వాదాలేనని, ఎవరూ ఆవేశకావేశాలకు లోనుకారాదని చంద్రబాబు సూచించారు. ఇది కీలక సమయం అని, మన లక్ష్యం రాష్ట్ర ప్రయోజనాల మీదే ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఇలాంటి రాజకీయాలు, విమర్శలు వస్తూనే ఉంటాయని, ఎదుర్కుంటునే ఉంటామని చెప్పారు...

cbn 15032018 2

నిన్న రాత్రి కూడా, పవన్ మీటింగ్ తరువాత కొందరు మంత్రులు, పార్టీ సీనియర్లతో ఆయన టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రానికి రావాల్సిన సాయం రాబట్టడానికి తెలుగుదేశం పార్టీ తన సర్వ శక్తులూ ఒడ్డి కేంద్రంపై పోరాడుతుంటే ఈ సమయంలో త మపై దాడి చేయాల్సిన అవసరం ఏమిటని ముఖ్యమంత్రి చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. ఈ సమయంలో మమ్మల్ని తిట్టడం ఏమిటి? మేం కేంద్రంపై పోరాటం చేస్తుంటే మాపై గురి పెట్టి మాట్లాడిస్తోంది ఎవరు? ఎవరి తరపున మాట్లాడుతున్నారు? రాష్ట్రానికి అన్యాయం చేసిన వారిని ఒక్క మాట అనడానికి నోరు రాకపోతే ఎలా? కేంద్ర ప్రభుత్వం పై ప్రజల్లో ఇంత ఆగ్రహం వ్యక్తమవుతుంటే వాళ్ల వైఖరి గురించి మాటైనా లేకుండా మాపై పడుతున్నారంటే అర్థమేంటి’ అని ఆయన ప్రశ్నించారు.

cbn 15032018 3

‘కులాల మధ్య చిచ్చు పెడుతున్నామని మాపై విమర్శలు చేశారు. బీసీలకు నష్టం కలగకుండా కాపులకు రిజర్వేషన్‌ కల్పిస్తామని మేం మా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. అదే మాట ప్రకారం ఒక పద్ధతి ప్రకారం బీసీ కమిషన్‌ వేసి అధ్యయనం చేసి ఆ నివేదిక కేంద్రానికి పంపాం. పోయిన ఎన్నికల్లో పవన్‌ మా తరపున ఎన్నికల ప్రచారం చేశారంటే మా ఎన్నికల ప్రణాళికకు మద్దతు ఇచ్చినట్లే కదా? మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? మత్స్యకారులను ఎస్టీల్లో చేరుస్తామని కూడా మా మేనిఫెస్టోలోనే పెట్టాం. ఇప్పుడు కొత్తగా చెప్పలేదు. ఈ నాలుగేళ్ల కాలంలో మీరెప్పుడూ ఇలా మాట్లాడలేదు. ఉద్ధానమో.. మరో సమస్యో మీరు లేవనెత్తితే మీపై గౌరవంతో స్పందించాం. వాటిపై చర్యలు తీసుకున్నాం. మేమెప్పుడూ మీపై అగౌరవం చూపలేదు. అలాంటిది.. ఇప్పుడు.. ఇలాంటి సమయంలో మాపై దాడి చేయడం సమంజనమేనా? రాష్ట్రం కోసం పోరాడుతున్న వారికి మీరిచ్చే మద్దతు ఇదేనా’ అని పవన్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read