మమ్మల్నే ఎదిరిస్టారా ? ఇప్పటి వరకు మాకు దేశంలో ఎదురు చెప్పిన వాడు లేడు... మా ఇమేజ్ దెబ్బ తీస్తారా ? మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని నిండు సభలో అవమానిస్తారా ? మీ అంతు చూస్తాం అంటుంది ఢిల్లీ...మీ కలలను చిదిమేస్తాం.. మీ వేలుతో, మీ కంటినే పొడుస్తాం అంటూ.. ఏపి పై మహా కుట్ర చేస్తుంది... తమిళనాడులో చేసినట్లు ఆంధ్రాలో, అస్థిరత సృష్టించే వ్యూహంలో ఉంది బీజేపీ... రాజకీయంగా ఇప్పటికే తన అస్త్రాలు సిద్ధం చేసుకుంది.. నిన్న రాత్రితో అది పూర్తిగా అర్ధమైంది... చంద్రబాబు పై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే వ్యూహం కూడా త్వరలో చూడబోతున్నాం... ముఖ్యంగా ఈ కుట్ర వెనుక రెండు ఉద్దేశాలు...ప్రస్తుతం కేంద్రం పై పోరాడుతుంది చంద్రబాబు ఒక్కడే, ఈ విషయంతో పాటు ప్రత్యేక హోదా అంశం పక్క దారి పట్టించటం... కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత కేంద్రంపై పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీకి ప్రజలలో వస్తున్న మద్దతుని రానివ్వకుండా చేసి ప్రజలలో అనుమానపు బీజాలు నాటి, గందరగోళాన్ని సృష్టించటం... రెండోది, ఈ 4సంవత్సరాలలో ఏమి లేని రాష్ట్రములో బస్సులో ఉంటూ పాలనని కొనసాగించి ఈరోజు రాష్ట్రాన్ని అగ్రగామి చెయ్యాలి అనే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రిని, ఆయన దృఢ సంకల్పాన్ని బలహీన పరచి తద్వారా రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించి మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడలేకుండా చెయ్యటం...
ఇదే విషయం చంద్రబాబు కూడా ధృవీకరించారు... ఏపీ ప్రజల సహేతుకమైన డిమాండ్‌ను పరిష్కరించడం మానేసి.. జగన్‌ను, పవన్‌ను అడ్డం పెట్టుకుని టీడీపీపై విమర్శలు చేయించడం వెనుక బీజేపీ ఉందనే స్పష్టమైన సమాచారం ఉందని చెప్పారు... గురువారం ఉదయం పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ వ్యూహ కమిటీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఇతరుల కుట్రలో పవన్ కల్యాణ్ పావు కావడం బాధాకరంగా ఉందన్నారు. ఆ కుట్రలో భాగంగానే తనపై నిందలు వేస్తున్నారని, అంతేగాక రాష్ట్ర ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు చెప్పారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఎవరికి ప్రయోజనం? ఈ విమర్శల వల్ల రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం కలుగుతుందా..?’’ అంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి రాజకీయ కుట్రలను ప్రజలు అర్థం చేసుకుంటారని, వాళ్లే తగిన బుద్ధి చెబుతారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
మన లక్ష్యాన్ని మనవాళ్లే దెబ్బతీయడం బాధాకరంగా ఉందని, రాష్ట్రం హక్కుల కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని, ఢిల్లీ ఆదేశాల ప్రకారం, వాళ్లకి ఎదురు తిరిగినందుకు, సీఎంను బలహీన పర్చడం తగదని చంద్రబాబు హితవుపలికారు. ఇది కీలక సమయమని, అందరి లక్ష్యం రాష్ట్ర ప్రయోజనాల మీదే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. ఢిల్లీతో పోరాడి మన రాష్ట్ర హక్కులు సాధించుకోవాలని అన్నారు... దేశంలో యాంటీ మోదీ, యాంటీ బీజేపీ భావన బలంగా ఉందని ఆయన చెప్పారు. ఇందుకు నిన్న వెల్లడైన యూపీ, బీహార్ ఉప ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అందువల్ల, రాష్ట్ర ప్రజలు ఢిల్లీ కుట్రలు తిప్పి కొడుతూనే, జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ,జిత్తులమారి వేషాల వేస్తున్న వారిని అనుక్షణం ఎండగడుతూ... అణచివేతను, వేధింపుల్ని ఎదుర్కోవడానికి మనం సంసిద్ధం కావలి...మన రాష్ట్రాన్ని ఢిల్లీ పెద్దల కుట్రల నుంచి కాపాడుకోవాలి... జై ఆంధ్రప్రదేశ్... జై పోలవరం.. జై అమరావతి...