ఎంత మంది అమరావతిని వెనక్కు లాగటానికి ప్రయత్నిస్తున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం, అమరావతిని ముందుకు తీసుకువెళ్తూనే ఉన్నారు... ఢిల్లీ వాళ్ళు, సొంత మనుషులు అమరావతి పై ఏడుస్తూ, కుట్రలు చేస్తున్నా, అవే దీవెనలు అనుకుని, ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు చంద్రబాబు... వీరు అమరావతి పై విషం చిమ్ముతూ బ్రాండ్ ఇమేజ్ చెడగోడుతుంటే, చంద్రబాబు అమరావతి బ్రాండ్ ఇమేజ్ నిర్మించుకుంటూ వెళ్తున్నారు... అమరావతికి ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు, చంద్రబాబు చేసిన మరో ప్రయత్నం ఫలించింది... ఫార్ములా1 పవర్‌బోట్ రేసింగ్‌లో ప్రసిద్ధి చెందిన ఎఫ్1హెచ్2వో ప్రపంచ చాంపియన్‌షి్‌పనకు ఆతిథ్యమిచ్చే గొప్ప అవకాశం భారత్‌లోని అనేక నగరాలను కాదని అమరావతికి దక్కింది... వాయువేగంతో దూసుకుపోయే పవర్‌బోట్లు..కళ్లు గగుర్పొడిచేస్థాయిలో నీటిలో విన్యాసాలు..రెప్పపాటులో కిలోమీటర్ల మేర దూసుకువెళ్లే బోట్లు..అబ్బురపరుస్తూ ఔరా అనిపించేలా ఉండే పవర్‌బోటింగ్... ఇదంతా, అమరావతిలో మన కళ్ళ ముందు జరగనుంది.
అమరావతిలోని భవానీ ఐలాండ్‌లో ‘ఎఫ్1హెచ్2వో’ ప్రపంచ చాంపియన్‌షి్‌పను నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. 2018 వరల్డ్ చాంపియన్‌షి్‌పలో భాగంగా ఎఫ్1 వాటర్ స్పోర్ట్స్ నిర్వహణ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 8 మహానగరాల్లో వీటిని నిర్వహిస్తుంది. పోర్చుగల్, లండన్, ఫ్రాన్స్, చైనా, దుబాయ్‌తో పాటు ఈసారి భారత దేశంలోని, అమరావతి కూడా చోటు కల్పించారు. మే నెల 18న పోర్చుగల్‌లో మొదలయ్యే ఈ చాంపియన్‌షిప్ డిసెంబరు 15న షార్జాలో ముగుస్తుంది. నవంబరు 22 నుంచి 24 వరకూ అమరావతి వేదికగా నిలవనుంది. భారత్‌లో చివరిసారిగా పదేళ్ల కిందట ఒకసారి ఈ పోటీలు జరిగాయి. తర్వాత ఇప్పుడు అమరావతి వేదిక కానుంది.
ఈ ‘ఎఫ్1హెచ్2వో’ వరల్డ్ చాంపియన్‌షిప్, మన రాష్ట్రానికి తీసుకురావటానికి చంద్రబాబు గత ఏడాది నుంచి, ఎంతో శ్రమించారు... ఎఫ్1హెచ్2వో ప్రతినిధులతో ఏడాది వ్యవధిలో నాలుగుసార్లు చర్చించారు. .. బ్యారేజీ నుంచి నది 23కి.మీ. మేర ఉండడం, 11 లంకలు(ఐలాండ్‌లు), అక్కడక్కడా నది వంపులు, నీటిలో అలలు లేకుండా నిర్మలంగా ఉండడం వంటి సాంకేతిక కారణాలను పరిశీలించి ఈ ప్రాంతాన్ని రేసింగ్‌కు అనువైనదిగా గుర్తించారు.... ‘ఎఫ్1హెచ్2వో’ ప్రతినిధి బృందంతో, ఈ రేస్‌లు అమరావతిలో నిర్వహిస్తే రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటుందని, ప్రపంచ స్థాయిలో మా కొత్త నగరానికి గుర్తింపు వస్తుందని చంద్రబాబు కోరారు. సాంకేతికంగా కూడా అనువుగా ఉండడంతో ఈ ఏడాది ఛాంపియన్‌షిప్ కేలెండర్‌లో అమరావతిని వేదికగా ఎంపిక చేశారు... ఇక నవంబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా, అంతర్జాతీయ పర్యాటకులు, క్రీడాభిమానులు, పాత్రికేయులు, మీడియా ప్రతినిధులు ఇలా అనేకమంది రాకతో నవంబరులో విజయవాడలో సందడి నెలకొననుంది.