10 రోజుల తరువాత బయటకు వచ్చాడు... మొన్న ఒక నాలుగు రోజులు హైదరాబాద్ నుంచి వచ్చి, ఇక్కడ హడావిడి చేసి, మళ్ళీ హైదరాబాద్ పోయాడు... ఏమైయ్యాడో తెలియదు.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలిసి కూడా, తెలంగాణలో ఉన్న ఆయన ఇంట్లో నుంచి బయటకు రాలేదు... మధ్యలో రెండు నేషనల్ చానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చి, మోడీని ఆహా ఓహో అని పొగిడి, చంద్రబాబుని నాలుగు తిట్టి, నిన్న ఒక సినిమా ఫంక్షన్ కి పోయి, ఈ రోజు కమ్యూనిస్ట్ లతో మీటింగ్ ఒకటి పెట్టుకుని, హైదరాబాద్ లో కూర్చుని, మన రాష్ట్ర సమస్యల పై చర్చించామని చెప్పి, బయటకు వచ్చి, అమరావతి పై ఏడుపు కంటిన్యూ చేసాడు... అదేమన్నా లాజిక్ ఉందా అంటే ? లాజిక్ లేదు ఏమి లేదు...
ముందుగా అమరావతి, కేవలం తెలుగుదేశం పార్టీ రాజధాని మాత్రమే అంటూ, లోపల ఉన్న కులం అజెండా బయట పెట్టాడు... అయినా, అమరావతి 29 గ్రామాల్లో, అన్ని కులాల వారు హాయిగా ఉంటున్నారు... విజయవాడ, గుంటూరులో అన్ని కులాల వారు కలిసిపోయి, చక్కగా జీవిస్తున్నారు.. అయినా అమరావతి తెలుగుదేశం రాజాధాని అయితే, పవన్ కళ్యాణ్ గారు, ఆయాన ఇల్లు, ఆఫీస్, రెండు ఎకరాల్లో ఎందుకు కడుతున్నారో ? VIT, SRM లాంటి యూనివర్సిటీలు, తెలుగుదేశం రమ్మంటే వచ్చాయా ? ఆంధ్రప్రదేశ్ రమ్మంటే వచ్చాయా ? అక్కడ కడుతున్న స్కూల్స్, హోటల్స్, హాస్పిటల్స్, ఇవన్నీ దేశంలోనే టాప్ సంస్థలు... ఇవి తెలుగుదేశం రమ్మంటే వచ్చాయా ? ఆంధ్రప్రదేశ్ రమ్మంటే వచ్చాయా ? ఇక్కడ కేవలం తెలుగుదేశం వారు మాత్రమే ఉద్యోగాలు చేసి, కాపురాలు చేస్తారా ? కనీస అవగాహన ఉందా నీకు పవన్ ? ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని, కులాల పేరు మీద విడదీసి, ప్రజలను రెచ్చగొట్టటం, నీలాంటి ఇమేజ్ ఉన్నవాడికి అవసరమా ?
పైన కులాన్ని లాగాడు.. ఇప్పుడు ప్రాంతాన్ని లాగి, ప్రాంతాల వారీగా రెచ్చగొడుతున్నాడు... అసలు ఈ వాదన అయితే మరీ వింత వాదన... ప్రజలను ప్రాంతాల వారీగా గోడలు కట్టుకుని అమరావతిలో ఉండమంటున్నాడు... ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల నుంచి అమరావతిలో స్థిర పడదామనుకునే వారికి ఎలాంటి వసతులు కల్పిస్తారు? ఏదైనా ప్రదేశం వారికి ఉందా? అంటూ, 33 వేల ఎకరాల్లో, 2 వేల ఎకరాలు సీమ వాళ్ళు ఉండటానికి, 2 వేల ఎకరాలు ఉత్తరాంధ్ర వాళ్లకి, 2 వేల ఎకరాలు ఆంధ్రా వాళ్ళు ఉండటానికి కేటాయించాలి అంట... ఈయన గారిని తీసుకువెళ్ళి మ్యుజియంలో పెట్టాలి... అసలు ఇలాంటి ఐడియా పవన్ కు ఎవరు ఇచ్చారో కాని... అసలు ముందు వీళ్ళకి అమరావతి అంటే ఏంటో తెలియదు... భూసమీకరణ చేసింది 33 వేల ఎకరాలు.... రైతుల త్యాగానికి ప్రతిఫలంగా, డెవలప్ చేసి తిరిగి ఇచ్చింది 9 వేల ఎకరాలు... ఇంకో 15 వేల ఎకరాలు రోడ్లకీ, పార్కులకీ, ఇలా కామన్ ఏరియాకి పోతాయి.... చివరకు ప్రభుత్వానికి మిగిలేది 9 వేల ఎకరాలు మాత్రమే... ఇక్కడ ప్రభుత్వ బిల్డింగ్స్ పోను, వరల్డ్ క్లాస్ సంస్థలు వస్తాయి... అప్పుడే అమరావతి వరల్డ్ క్లాస్ అయ్యేది... మరి జిల్లాకి 2-3 వేల ఎకరాలు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారు ? నోరు తెరిస్తే అవగాహనా రాహిత్యం బయట పడుతుంది... ఇంత ప్రేమ రాయలసీమ మీద, ఉత్తరాంధ్ర మీద ఉంటే, తమరి ఇల్లు రాయలసీమలో, పార్టీ ఆఫీస్ ఉత్తరాంధ్రలో పెట్టుకోవచ్చుగా ?