ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కేంద్రం సాయం చెయ్యని పరిస్థుతులు నేపధ్యంలో, అన్ని పార్టీలతో అఖిల సంఘాల సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రేపు ఉదయం 11 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఒక్కో రాజకీయ పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులు చొప్పున ఈ సమావేశానికి రావాలని కోరనున్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో పాటు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే వివిధ సంఘాలను ఈ సమావేశానికి పిలవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

cbn 26032018

మరో వైపు నిన్న టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సెంటిమెంట్‌ను అందరూ గౌరవించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయా రాజకీయ పార్టీలకు, నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు. ఆంధ్రా పక్షమా? కేంద్రం పక్షమా? అన్నది ఆయా పార్టీల నేతలే తేల్చుకోవాలన్నారు. ప్రజల కోసం పోరాడే ముఖ్యమంత్రి పక్షాన ఉంటారా? రాష్ట్రానికి అన్యాయం చేసే కేంద్రం పక్షాన ఉంటారా? అని నిలదీశారు. ప్రజల హక్కుల కోసం పోరాడే తెలుగుదేశం పక్షాన ఉంటారా? ప్రజల మనోభావాలను నిర్లక్ష్యం చేసిన బీజేపీ వైపు ఉంటారో నిర్ణయించుకోవాలన్నారు.

cbn 26032018

ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చేవి కూడా ఏపీకి ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదన్నారు. తొలి బడ్జెట్‌లోనే రెక్కలు విరిచి ఎగరమంటే ఎలా? అని కేంద్రాన్ని తాను నాలుగేళ్ల క్రితమే నిలదీశానని చెప్పారు. 29సార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్రాన్ని ఆదుకోమన్నాం. అయినా కేంద్రంలో స్పందన లేదు. అందుకే కేంద్రం నుంచి బయటకొచ్చాం. ఎన్డీయే నుంచి వైదొలిగాం. నిధులు రాబట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేశాం. విధిలేని పరిస్థితుల్లోనే పోరాటమార్గం పట్టాం’ అని చంద్రబాబు చెప్పారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ.1050కోట్లలో రూ.940కోట్లకు యూసీలిచ్చాం. అమరావతికి ఇచ్చిన వెయ్యి కోట్లకు యూసీలిచ్చాం. గుంటూరు, విజయవాడకు ఇచ్చిన నిధుల్లో రూ.350కోట్లకు యూసీలిచ్చాం. ఆర్థికలోటుకు యూసీలు ఇవ్వనవసరం లేదు. రాష్ట్రానికి చేసిన అన్యాయం ప్రజలకు వివరించాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read