ఢిల్లీ పెద్దల పాదాలు కనిపిస్తే చాలు, A1, A2 వాలిపోతున్నారు.. A1కు ఢిల్లీ పెద్దలను కలిసే ఛాన్స్ లేక కాని, లేకపోతే రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సమయంలో రామ్ నాథ్ కోవింద్ పై ఎలా పడ్డాడో చూసాం.. ఇక A2 గారి సంగతి అయితే చెప్పేది ఏముంది, ప్రత్యేక్షంగా ఒక 10 సందర్భాలు అయినా చూసి ఉంటాం... ఈ రోజు కూడా, రాజ్యసాభలో కాలు మీద కాలు వేసుకుని ప్రధాని మోడీ కూర్చుంటే, అదే కాళ్ళ మీద పడి, ఆశీర్వాదం తీసుకున్నాడు A2... ఇలా కాళ్ళ మీద పడ్డాడు అని, వార్తల్లో వస్తే, బయటకు వచ్చి, చంద్రబాబుని పిచ్చి బూతులు తిట్టాడు... అయితే, ఇప్పుడు మన A2కి ఇంకో ప్రముఖుడి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకునే టైం వచ్చింది....
ఆయనే రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు... అవును, ఇప్పుడు విజయసాయి గుట్టు అంతా, వెంకయ్య నాయుడు చేతుల్లో ఉంది... ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఇక రాజకీయంగా జగన్ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే... ఎందుకంటే, మోడీ కాళ్ళ మీద విజయాసాయి రెడ్డి పడ్డాడు అని వార్తలు వస్తున్నా, రాజ్యసభ గ్యాలరీలో ఉన్న వారు చూసినా, విజయసాయి రెడ్డి మాత్రం, ఇది తెలుగుదేశం కుట్ర అని కొట్టి పారేసాడు.. నేను ప్రధాని దగ్గరకు వెళ్లి నమస్కారం మాత్రమే పెట్టాను అని, ఇది ఛాలెంజ్ అంటూ మీడియా ముందు ఊగిపోయారు...
అయితే, సియం రమేష్ మాత్రం, విజయసాయి రెడ్డి కాళ్ళ మీద పడ్డాడని, నేను రాజ్యసభ చైర్మెన్ కు వీడియో ఫూటేజ్ కోసం లెటర్ రాసాను అని, ఈ రోజు సభలో ప్రొసీడింగ్స్ అన్నీ, కట్ చెయ్యకుండా, వీడియో వదలమని చెప్పినట్టు చెప్పారు... దీంతో ఇప్పుడు విజయసాయి రెడ్డి ఫ్యూచర్, జగన్ భవిష్యత్తు అంతా వెంకయ్య నిర్ణయం పై ఉంది... ఒక వేళ వెంకయ్య కనుక ఫూటేజ్ వదిలితే, విజయసాయి రెడ్డి, కాలు మీద కాలు వేసుకున్న మోడీ కాళ్ళ మీద పడే సీన్ ఈ రాష్ట్ర ప్రజలు చూసి తరిస్తారు.. ఆంధ్రా వాడి ఆత్మ గౌరవం, మోడీ కాళ్ళ పై ఎలా తాకట్టు పెట్టారో చూసి, సరైన నిర్ణయం తీసుకుంటారు...