2019 ఎన్నికల నాటికి బీజేపీ వ్యతిరేక కూటమి లక్ష్యంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పావులు కదుపుతున్నారు. ఆమె ఢిల్లీలో పలువురు విపక్షనేతల్నీ, విపక్ష ఎంపీలతో వరుస చర్చలు జరుపుతున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తోనూ, డీఎంకే ఎంపీ కనిమొళితోనూ మమతా బెనర్జీ విడివిడి సమావేశమయ్యారు. మోడీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు గురించి వారితో మంతనాలు జరిపారు. అలాగే పలువురు విపక్ష ఎంపీలతోనూ మమత చర్చలు జరుపుతున్నారు. 2019 ఎన్నికలు చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంటాయని చెప్పారు. రాజకీయ నాయకులు కలిసినప్పుడు రాజకీయాలే మాట్లాడుకుంటారని చెప్పారు. ఇందులో దాచి పెట్టడానికి ఏదీ లేదన్నారు.
వచ్చే ఎన్నికలు చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయన్నారు. తాను రేపు బీజేపీ సీనియర్ నేతలు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి తదితరులను కలుస్తానని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను కూడగడతామని థర్డ్ ఫ్రంట్‌ను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. దేశంలో బీజేపీని మించిన మతతత్వ పార్టీ లేదని.. మోదీ ప్రభుత్వం దేశ ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. బీజేపీకి మరోసారి అధికారం దక్కనివ్వకూడదంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ఫై కొన్ని కీలక వ్యాఖలు చేసారు... ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పారు... చంద్రబాబు, మోడీ పై గట్టిగా పోరాడుతున్నరాని, అభినందిస్తున్నా అని చెప్పారు... ఈ సందర్భంగా, చంద్రబాబు విధానాలకు, మీకు తేడా ఉన్నాయి కదా అని ప్రశ్నించగా, రాజకీయాల్లో ఇవన్నీ సహజం అని, కొన్ని సార్లు విభేదించినా, కొన్ని సార్లు అందరం కలిసి పోరాడాలని చెప్తూ, నేను చంద్రబాబుకు ఎప్పుడూ రెస్పెక్ట్ ఇస్తాను అని చెప్పారు..