ఇది మూడు గంటల సినిమా కాదు... ఇలా ఒక పాటలో, జీరో నుంచి, హీరో అయ్యి, నాలుగు పంచ్ డైలాగ్ లు చెప్పి, జేజేలు కొట్టించుకోటానికి... ఇది వాస్తవం... దగా పడ్డ ఆంధ్రుడిని ముందుండి, తన కష్టంతో, తన తెలివితేటలతో, మన రాష్ట్రానికి జరుగుతున్న పునర్నిర్మాణం... 67 ఏళ్ళ వయసులో, తన కుటుంబాన్ని వదిలి, 5 కోట్ల మంది ఆంధ్రుల కోసం, ఢిల్లీ చేస్తున్న కుట్రలు, మన రాష్ట్రంలోని తోడేళ్ళను తట్టుకుని, నిలబడి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్న చంద్రబాబు గారి సత్తా... అందుకే ఆయన్ను రీల్ హీరో కాదు, నిజమైన హీరో అంటుంది... ఈ నిజమైన హీరోని చూసి, ఆటోమొబైల్ దిగ్గజం హీరో కంపెనీ మన రాష్ట్రానికి వస్తుంది...
ఎన్నో అడ్డంకులు దాటుకుని, మార్చి 23న ప్లాంట్ కు శంకుస్థాపన చెయ్యనున్నారు... హీరో కంపెనీ తమ ప్లాంటును దక్షిణభారతదేశంలో పెట్టడానికి సిద్ధమవగానే ఆంధ్రాతోపాటు తెలంగాణ, కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు ఆ కంపెనీకి రెడ్ కార్పెట్ పరిచాయి. ఈ ప్రాజెక్టును పట్టుబట్టి సిఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు తెచ్చారు. సత్యవేడు మండలం శ్రీసిటీకి సమీపంలోని మాదన్నపాలెం వద్ద 636 ఎకరాల విస్తీర్ణంలో ద్విచక్ర వాహనాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
హీరో మోటార్స్ దశలవారీగా రూ.3200 కోట్ల పెట్టుబడి పెడుతుంది. 2019 చివర నాటికి సంవత్సరానికి 5 లక్షల మోటారు సైకిళ్లను తయారు చేసే సామర్థ్యం గల ప్లాంటును నిర్మిస్తారు. 2020నాటికి రెండో ప్లాంటును నిర్మిస్తారు. రెండు దశల్లో కలిపి రూ.1600 కోట్ల పెట్టుబడి పెడతారు. రెండు దశల నిర్మాణాలు పూర్తయితే ఏటా 10లక్షల వాహనాలు తయారవుతాయి. 2025కల్లా ఏటా 18లక్షల మోటారు సైకిళ్లను ఉత్పత్తి చేసే దిశగా అభివృద్ధి చేస్తారు. విడిభాగాల తయారీ యూనిట్ రూ.1600 కోట్లతో ఏర్పాటు చేస్తారు. మొత్తంగా 15వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక్కడ ఏర్పాటు చేయబోయే యూనిట్ ఆ సంస్థకు ఎనిమిదోది కానుంది.