విభజన హామీల్లో మన రాష్ట్రానికి ఇవ్వాల్సింది ఇవ్వకపోగా, ఇచ్చిన కొంచెం కూడా వెనక్కి తీసుకుంటున్నారు... వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఈ ఏడాది జనవరి 31వ తేదీన రూ.350 కోట్లు విడుదల చేశారు. కానీ... ప్రధాని ఆమోదం లేదంటూ వెంటనే మొత్తం డబ్బు వెనక్కి తీసుకున్నారు... ఇది నిజంగా ఎంత దౌర్భాగ్యం తెలియచేసే సంఘటన... డబ్బులు మన ఎకౌంటు లో వేసి, ప్రధాని వద్దు అన్నారని మళ్ళీ వెనక్కు తీసేసుకున్నారు అంటే, వీరు ఎలాంటి వారో అర్ధమవుతుంది... ఇదే విషయం పై, ఈ రోజు అసెంబ్లీలో ఏకి పడేసారు..
ఎన్నడూ లేని విధంగా నిధులు వెనక్కి తీసకోవడంపై టీడీపీ సభ్యులు బీజేపీ సభ్యులను నిలదీశారు. దీనిపై స్పందించిన బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. ఇందులో కేంద్రం నాయకుల ప్రమేయం లేదని, టెక్నికల్ సమస్యవల్ల ఇదంతా జరిగిందని అన్నారు. దీంతో మంత్రి కాల్వ శ్రీనివాసులు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ఎదురుదాడికి దిగారు. రాష్ట్ర ఖజానాకు వచ్చిన నిధులను పీఎంవో వెనక్కు తీసుకోవడం ఎప్పుడూ జరగలేదని కాల్వ శ్రీనివాసులు అన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం అనుమతి లేదని చూపించి వెనక్కి తీసుకోవడం అన్యాయమని ఆయన అన్నారు.
రాష్ట్రాలకు కొన్ని హక్కులు ఉంటాయని, చట్టాల ప్రకారం రాష్ట్రాలకు ఇవ్వాల్సినవి ఇవ్వాలని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ డిమాండ్ చేశారు. ఆ నిధులు రాష్ట్రానికి రావాల్సిన హక్కని, వెనుకబడిన జిల్లాలకు నిధుల్ని చట్టం ప్రకారం కేటాయించాల్సిందేనని, దాన ధర్మాలు చేసేది కాదని, కొన్నేళ్లు ఇచ్చారని, ఇప్పుడు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణడు అన్నారు. యూసీలు సమర్పించకపోతే అసలు నిధులే కేటాయించరని ఆయన తెలిపారు.