ఒక పక్క రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందిరికీ తెలిసిందే.. ఇలాంటి టైంలో, ప్రజా ప్రతినిధుల బాధ్యత ఎక్కువ ఉంటుంది... చంద్రబాబు ఎదో అన్యాయం చేసాడని, అసెంబ్లీ బహిష్కరించిన వైసిపీ ఎమ్మల్యేలు, మేము రోడ్లు మీద పోరాటాలు చేస్తామని, ప్రజా సమస్యల పై పోరాడతామంటూ స్పీచ్ లు ఇచ్చారు... స్పెషల్ స్టేటస్ మా ఊపిరి, మా ప్రాణం అంటూ హడావిడి చేసారు.... తీరా ఇంత కీలకమైన సమయంలో రోడ్లు మీద కాదు కదా, కనీసం మన దేశంలో కూడా లేరు... మొన్నటి దాకా, నేపాల్ లో క్యాంప్ ఎంజాయ్ చేసారు... రాజ్యసభకు పోటీ లేదని తెలుసుకుని సొంత ఊళ్ళు వచ్చేశారు...

bali 20032018 2

అయితే, నేపాల్ లో సరిగ్గా ఎంజాయ్ చెయ్యలేదు అని, అక్కడ ఏమి ఎంజాయ్ చెయ్యటానికి లేదని, ఎదో జైలు లాగా ఉందని, మమ్మల్ని ఎక్కడికైనా రిఫ్రెష్మెంట్ కోసం పంపించమని, జగన్ దగ్గర గొడవ పెట్టుకున్నరంట ఎమ్మల్యేలు.. దీంతో కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, వీళ్ళని ఎక్కడికో ఒక చోటికి పంపించి, ఎలాగూ ఎలక్షన్ జరిగితే ఒక వంద కోట్లు అయినా ఖర్చు అయ్యేది కదా అంటూ, జగన్ కోరటంతో, ఎమ్మల్యేలకి హాంగ్ కాంగ్, బాలి, మకావ్ లకు ఏర్పాట్లు చేసారు... అయితే, 44 మంది ఎమ్మల్యేలలో, ఒక 20 మంది మాత్రమే ఈ ట్రిప్ కు వెళ్లారు...

bali 20032018 3

కడప జిల్లా నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు, కర్నూలు నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, చిత్తూరు జిల్లాల నుండి ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు, మరి కొంత మంది ఎమ్మల్యేలు వెళ్లారు.. శుక్రవారం రాత్రి థాయ్ ఎయిర్వేస్ లో, వీరు హైదరాబాద్ నుంచి వెళ్లారు. ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి శనివారం వెళ్లారు.. ఇదే టైంలో, నలుగు బులెట్ లు ఉన్నాయని, భద్రతా సిబ్బంది అరెస్టు చేసారు అనే వార్తలు కూడా ఆ రోజు వచ్చాయి... అయితే, వెంటనే ఆయన్ను విడిచి పెట్టటంతో, ఆయన కూడా బాలి వెళ్లి, వారితో జాయిన్ అయ్యారు... రాయచోతి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మాత్రం, ఇలాంటివి నాకు ఇష్టం లేదని, ఆయన వెళ్ళలేదు అని సమాచారం... ఇదండీ వీళ్ళ వరుస... ఈ వార్తా డెక్కన్ క్రానికల్ లో కూడా వచ్చింది https://www.deccanchronicle.com/nation/current-affairs/180318/ysrc-mlas-on-a-vacation-to-bali.html

Advertisements

Advertisements

Latest Articles

Most Read