యువత కోసం చంద్రబాబు తీసుకున్న మరో వినూత్న నిర్ణయం ఇది... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ), స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో, నైపుణ్యరధాన్ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు... ఉద్యోగావకాశాల కోసం అన్వేషించే వారికి, ఇది సహకరించ నుంది... ఇక్కడ వరుకే పరిమతం కాదు, నైపుణ్యం కోసం శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు కూడా ఇందులో ఉన్నాయి... అందుకోసం, వరుసగా కంప్యూటర్లు... చక్కటి వసతులు.. కార్పొరేట్ ఆఫీస్ తరహాలో ఈ బస్సు తాయారు చేసారు...
వివిధ కంపెనీలు, పరిశ్రమల్లో ఉండే ఉద్యోగాల సమాచారాన్ని సేకరించి నిరుద్యోగ యువతకు అందించడమే దీని ప్రధాన లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు, విద్యార్థుల కోసం ఎన్నో నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వీటితో పాటు ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తున్నామని స్కిల్ డెవలప్మెంట్ సీఈవో కె. సాంబశివరావు తెలిపారు వెల్లడించారు. ఇప్ప టికే ఒక నైపుణ్యరథం గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిరుద్యోగులు, ఉపాధి కల్పించే కంపెనీల మధ్య అనుసంధానంగా పనిచేస్తోందన్నారు. అయితే ఇందులో నైపుణ్యం కోసం శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు కూడా ఉండటం విశేషం అన్నారు...
ఈనెల 22న అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నైపుణ్యరథాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని వెల్లడించారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్..! ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నవారు APPLI అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకుని వారి అర్హతకు సంబంధించిన వివరాలన్నింటినీ నమోదు చేసుకోవాలని, ఆ తర్వాత వారి అర్హతల ప్రకారం ఈ-మెయిల్ కు ఎప్పటికప్పుడు ఉద్యోగాల సమాచారం పంపుతామని సాంబశివరావు తెలిపారు. మరిన్ని వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబరు 18004252422 లో సంప్రదించాలని సూచించారు. యాప్ ద్వారా ఇప్పటి వరకు దాదాపు 1700కంపెనీ లతో నైపుణ్యరథం అనుసంధానం అయిందన్నారు...