చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత, ఒక్కో కుట్ర బయటకు వస్తుంది... ఒరిస్సాలో ఓట్లు కోసం, ఒరిస్సాలో అధికారం కోసం బీజేపీ ఆడుతున్న నాటకాలు బయట పడ్డాయి... వీళ్ళు ఓట్లు కోసం, ఒక రాష్ట్రాన్ని ఎలా నాశనం చేస్తున్నారో చూస్తున్నాం... ఇప్పుడే వాళ్ళే, స్వయానా వాళ్ళు చేసిన అన్యాయం చెప్పుకున్నారు... ఓట్లు కోసం, ఆడిన అబద్ధాలలో, పొరపాటున నిజం బయటకు వచ్చింది...కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న, ఒరిస్సాలో పర్యటించారు...అక్కడ అధికార బీజేడీ పార్టీ పై విమర్శలు చేసారు... మనకు ఇక్కడ చెప్పినట్టే, ఒరిస్సాకు ఎంతో చూసాం, లక్షలు లక్షలు కోట్లు ఇచ్చాం, కాని ఇక్కడ ప్రభుత్వం అవినీతి చేసింది అంటూ, మనకు పాడిన పాటే పాడారు...
ఈ సందర్భంలో పోలవరం గురించి మాట్లాడారు... పోలవరం ప్రాజెక్ట్ విషయం పై ఒరిస్సాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అని, బీజేపీ ప్రభుత్వం, పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పక్షపాతం చూపిస్తుంది అంటూ ఆరోపణలు వస్తున్నాయి అని విలేకరులు అడగగా... పోలవరం విషయంలో మేము చాలా స్పష్టంగా ఉన్నాం... కేంద్రం, ఒరిస్సాకు అన్యాయం చెయ్యాలని అనుకోవటం లేదు... అసలు చంద్రబాబు, మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు అంటే పోలవరం ప్రాజెక్ట్ గురించే అంటూ వ్యాఖ్యలు చేసారు.. అంటే, పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కేంద్రం సరిగ్గా సహకరించటం లేదు, తద్వారా ఒరిస్సాకి న్యాయం చేస్తుంది, అందుకే పోలవరం విషయంలో కేంద్రం సహకరించటం లేదు కాబట్టి, చంద్రబాబు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు అని కేంద్ర మంత్రి చెప్తున్నారు...
అంతే కాదు, మరో విషయం మాట్లాడుతూ, మనకు బుద్ధి చెప్తారంట కేంద్ర మంత్రి గారు... కొఠియా గ్రూప్ గ్రామాలు ఒడిశావేనని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తమవంటే గుణపాఠం చెప్తామంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వార్నింగ్ ఇస్తున్నారు... డిశా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒడిశా సరిహద్దులను కాపాడుకోవడం ప్రతి పౌరుడు బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు... ఇలా వీళ్ళు వెళ్ళిన ప్రతి రాష్ట్రంలో, అక్కడ పరిస్థితులకు తగ్గట్టు మాట్లాడుతూ, రాష్ట్రానికి రాష్ట్రానికి చిచ్చు పెడుతూ, మోడీ లక్షల లక్షల కోట్లు ఇస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వాలే అవినీతి చేస్తున్నాయి అంటూ, ప్రతి రాష్ట్రంలో ఇదే పాట పాడుతున్నారు... ప్రజలు ఇప్పటికే వీళ్ళ ఫేక్ ప్రచారం కనిపెట్టారు... ఇలాని సోదికి విసిగి పోయారు.. పాపం ఈ బీజేపీ వాళ్ళకే అర్ధం కావటం లేదు...