పోలవరం ప్రాజెక్టుపై నిరంతర నిఘా అవసరమని, ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. పోలవరం సహా ప్రాధాన్య ప్రాజెక్టులపై సచివాలయంలో సోమవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై వర్చువల్‌ ఇన్‌స్పెక్షన్‌తో సహా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు జాతీయ స్థాయిలో కేంద్రీకృతమైనందున ఎలాంటి అవరోధాలూ లేకుండా శత్రుదుర్భేద్యంగా మార్చాలని, పనుల్లో ఎలాంటి ఆటంకాలూ లేకుండా కట్టదిట్టమైన చర్యలు చేపట్టాలని జల వనరులశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పరిధిలోని పునరావాస కాలనీలను ఫైబర్‌ నెట్‌తో అనుసంధానం చేయాలని సూచించారు.

polavaram 100042018

ప్రాజెక్టులో ముఖ్య భాగమైన డయాఫ్రమ్‌ వాల్‌ జెట్‌ గ్రౌంటింగ్‌ నిర్మాణాన్ని ఈ వేసవి ఆయ్యేలోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. మొత్తం 10 కెమెరాలతో పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్నామని అధికారులు వివరించారు. ఇప్పటి వరకు 52.10 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి కాగా, కుడి ప్రధాన కాలువ 89.10శాతం, ఎడమ ప్రధాన కాలువ 58.30 శాతం మేర పనులు పూర్తయినట్లు సిఎంకు అధికారులు వివరించారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు మొత్తం రూ.13,364.98 కోట్లు ఖర్చు చేయగా, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన అనంతరం రూ.8,229.11 కోట్లు ఖర్చు పెట్టినట్లు అధికారులు తెలిపారు. ఇందులో రూ.5,342.26 కోట్లు కేంద్రం ఇచ్చిందని, మరో రూ.2,886.85 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందన్నారు.

polavaram 100042018

రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టుల పురోగతిని కూడా ఈ సందర్భంగా సీఎం సమీక్షించారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను నెలకోసారి స్వయంగా సమీక్షించాలని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సూచించారు. ప్రభుత్వం చేపట్టిన 53 ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఇప్పటికే 8 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయన్నారు. పెదపాలెం, చినసాన, పులికనుమ ఎత్తిపోతల పథకాలు, ఓక్‌ టన్నెల్‌, గోరకల్లుబ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. సమీక్షలో జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read