గాలి జనార్దన్ రెడ్డి... ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు... రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో, అక్రమ మైనింగ్ లో, ఒక పీకు పీకాడు... జగన్ సొంత కొడుకు అయితే, గాలి నా పెద్ద కొడుకు అంటూ అప్పట్లో రాజశేఖర్ రెడ్డి చెప్తూ ఉండే వారు... అలాగే, జగన్ లక్ష కోట్లు కొట్టేస్తే, పెద్ద కొడుకు గాలి జనార్ధన్ రెడ్డి కొట్టేసిన అక్రమ మైనింగ్ లెక్క అంతా ఇంతా కాదు.. చివరకు ఇద్దరు కొడుకులు జైలుకు వెళ్లి, ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతున్నాడు అనుకోండి... అయితే, ఇప్పుడు దేశం మొత్తం ఆశ్చర్యపోయే వార్తా వినిపిస్తుంది... అదే, గాలి జనార్దన్ రెడ్డి, బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు అనే వార్త...
గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేస్తారని ఆయన సోదరుడు సోమశేఖర రెడ్డి బుధవారంనాడు తెలిపారు. మైనింగ్ కుంభకోణాల్లో 42 నెలల పాటు ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తి, ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు... స్కామ్‌ల నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి విషయంలో పార్టీ మౌనంగానే ఉంటున్నప్పటికీ తాము పార్టీతోనే ఉన్నామని రెడ్డి బ్రదర్స్ చెబుతున్నారు. తాజాగా తన సోదరుడు బళ్లారి నుంచి బీజేపీ టిక్కెట్‌పైనే పోటీ చేస్తారని సోమశేఖర్‌రెడ్డి చెప్పడంతో కర్ణాటక ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి...
మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు బీజేపీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాయి. ఒక పక్క, నరేంద్ర మోడీ, అవినీతి పై యుద్ధం అంటూ దేశం అంతా తిరిగి చెప్తూ, 42 నెలల పాటు జైలులో ఉండి వచ్చిన వ్యక్తిని, తన పార్టీ తరుపున పోటీ చేసే అవకాశం ఇస్తున్నారని తెలియటంతో, దేశ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు... గతంలో జనార్ధన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. అప్పట్లో బీజేపీ తరఫున ఎమ్మెల్సీ హోదాతో గాలి జనార్ధన్ రెడ్డి మంత్రి పదవిని చేపట్టారు.