విభజిత ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ప్రత్యేక హోదానిచ్చి, రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా సహకరించా ల్సిందేనని మాజీ ప్రధానమంత్రి హెచ్.డి. దేవేగౌడ స్పష్టం చేసారు. ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. లోక్ సభలో తెదేపా, వై.కా.పా. ల అవిశ్వాస తీర్మానాలు చర్చకు రాకుండా కేంద్రమే వ్యూహాత్మకంగా అడ్డుకుంటోందన్న ఆరోపణల్ని ప్రస్తావించినపుడు 'ఆదీ జరిగి ఉండవచ్చు అని అభిప్రాయపడ్డారు. అవిశ్వాసాన్ని ప్రవేశ పెట్టి ప్రభుత్వాన్ని కూల్చేందుకు సమయమింకా రాలేదన్నారు. ఒకవేళ అది చర్చకు వచ్చినపుడు తమ అభిప్రాయాన్ని చ్చేప్తానన్నారు. ఈ సందర్భంగా, రాష్ట్ర హక్కుల కోసం, చంద్రబాబు చేస్తున్న పోరాటాన్ని అభినందించారు...
మూడో ఫ్రంట్ గురించి తనతో పలువురు మంతనాల్ని సాగిస్తున్నా, కర్ణాటక విధానసభ ఎన్ని కల్లో తీరిక లేకుండా ఉన్నందున దృష్టి పెట్టలేదన్నారు. 'తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈ అంశంపై నాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబూ నాకు మిత్రుడే. కొందరు కాంగ్రెస్ లోని, మరికొందరు కాంగ్రెస్, భాజపా లేని మూడో ఫ్రంట్ ను ఆకాంక్షిస్తున్నారు. వాటి ఏర్పా టుకు ఇంకా తరుణం రాలేదు అని చెప్పారు. తాను మతాతీత లౌకికవాదో కాదో ప్రజలే తేల్చి చెబుతారని దేవేగౌడ వ్యాఖ్యానించారు...
మతాతీత లౌకికవాదం పట్ల తన నిబద్దతను ప్రశ్నించే నైతికాధికారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎక్కడుందని ప్రశ్నించారు. 'ఎవరో రాసిచ్చిన మాటల్ని సభల్లో వల్లెవేస్తే సరిపోదు. చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి' అని కాంగ్రెస్ అధ్యక్షుడి తీరు పై మండిపడ్డారు. శని, ఆదివారాల్లో రాహుల్ పాత మైసూరు ప్రాంత ప్రచార సభల్లో జనతాదళ్ - భాజపా చేతులు కలుపుతోన్నట్లు ఆరోపించారు. దీనికి దేవేగౌడ తీవ్రంగా స్పందించారు. కర్ణాటకలో ప్రస్తుతం ఉండేది ఇందిరా కాంగ్రెసా? సోనియా కాంగ్రెసా? సిద్దరామయ్య కాంగ్రెసా? తేల్చిచెప్పాలని రాహుల్ ను డిమాండు చేశారు.