Sidebar

11
Sun, May

ఢిల్లీ పెద్దల పాదాలు కనిపిస్తే చాలు, A1, A2 వాలిపోతున్నారు.. A1కు ఢిల్లీ పెద్దలను కలిసే ఛాన్స్ లేక కాని, లేకపోతే రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సమయంలో రామ్ నాథ్ కోవింద్ పై ఎలా పడ్డాడో చూసాం.. ఇక A2 గారి సంగతి అయితే చెప్పేది ఏముంది, ప్రత్యేక్షంగా ఒక 10 సందర్భాలు అయినా చూసి ఉంటాం... ఒక ఇద్దరు ఆర్ధక నేరగాళ్ళు, 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసుల్లో A1, A2, 16 నెలలు జైలుకి వెళ్లి వచ్చి, బెయిల్ పై బయట తిరుగుతున్న వీళ్ళు, అవలీలగా వెళ్లి ఒక దేశ ప్రధానిని కలుస్తూ, ప్రాధాన మంత్రి ఆఫీస్ లోనే ఉంటూ, రాష్ట్రం పై ఎలాంటి కుట్రలు పన్నుతున్నారో చూస్తూనే ఉన్నాం...

vijayasai 28032018 2

నిన్న రాజ్యసభలో, కాలు మీద కాలు వేసుకున్న ప్రధాని మోడీ కాళ్ళ పై పడి ఆశీర్వాదం తీసుకున్నారు A2... ఒక పక్క రాష్ట్రంలోని 5 కోట్ల మంది, మోడీ పైనే యుద్ధం చేస్తుంటే, అలాగే మోడీ మనకు అన్యాయం చేస్తుంటే, ఇటు విజయసాయి రెడ్డి మాత్రం, మోడీ కాళ్ళకు మొక్కి, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాలకుల కాళ్ళ దగ్గర పెట్టారు... ఈ విషయం వార్తల్లో రావటంతో, బయటకు వచ్చి కచ్చి ఎలా తీర్చుకోవాలో తెలియక, చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు... నా ఇష్టం వచ్చినన్ని సార్లు మోడీని కలుస్తా అంటూ, మీ చావు మీరు చావండి అన్నట్టు రాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నాడు...

vijayasai 28032018 3

అయితే, ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మరో సారి షాక్ కు గురయ్యే వార్త... 5 కోట్ల ఆంధ్రులు మోడీ పై పోరాడుతుంటే, ఇదే మోడీ చేత తాను రాసిన పుస్తకం విడుదల చేపించనున్నాడు A2 విజయసాయి రెడ్డి... మళ్ళీ కాళ్ళ పై పడే సీన్ ఈ రాష్ట్ర ప్రజలు చూడనున్నారు... "వెంకటేశ్వర వైభవం" అనే పుస్తకం రాసాడు అంట A2.. ఈ పుస్తకం ఆవిష్కరించడం కోసం మోడీని టైం అడిగితే, సరే అన్నారు అంట... తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలు మన ప్రధానికి కనపడవు కాని, A2 రాసిన పుస్తకం మాత్రం విడుదల చేస్తారంట... ఆయినే, 16 నెలలు జైలుకి వెళ్లి వచ్చి, బెయిల్ పై బయట తిరుగుతున్న వాడికి, ప్రధాని స్థాయి వ్యక్తి ప్రోత్సహిస్తున్నాడు అంటే, ఇంకా ఏమి చెప్పాలి ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read