దొంగే, దొంగా దొంగా అని అరిసినట్టు... వీరి చేతగానితనాన్ని, వేరే వారి పై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు ప్రధాని మోడీ... నిజానికి, ఇలాంటి విద్యల్లో ఆరితేరి పోయారు... అయితే, దేశ ప్రజలు, ఇలాంటివి చూసి చూసి విసిగిపోయారు... ఇలాంటి డ్రామాలతో, ప్రతి సారి జనాలని పిచ్చోళ్ళని చెయ్యలేము అనేది బీజేపీ పెద్దలు గ్రహించాలి... ఒక్క పార్టీ ఎంపీలు ఆందోళన చేస్తుంటే, వారిని సస్పెండ్ చేసి సభ నడపాల్సిన బాధ్యత మర్చిపోయి, వారి చేతే డ్రామాలు ఆడించి, నీ మీద విశ్వాసం లేదు అని దేశంలో సాగానికి పైగా ఎంపీలు నోటీసు ఇస్తే, అది చర్చకు జరిపే దమ్ము లేక, పారిపోయిన మోడీ, ఇప్పుడు ప్రజలని మభ్యపెట్టటానికి, మరో డ్రామాతో ముందుకు వస్తున్నారు...
పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడిన తరువాత, బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు... బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోడీ మాట్లాడుతూ, ఆయన ప్రభుత్వం చేతగాని తనాన్ని, ప్రతిపక్షాల పై రుద్దే ప్రయత్నం చేసారు... ప్రతిపక్షాలు విభజన రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు... ఈ ప్రతిష్టంభనకు కారణం కాంగ్రెసేని ఘాటుగా విమర్శించారు. పార్లమెంటులో ఏర్పడిన ప్రతిష్టంభనకు నిరసనగా ఈ నెల 12న తమ పార్టీ ఎంపీలు నిరాహార దీక్ష చేస్తారని చెప్పారు...
తమ పార్టీ (బీజేపీ) కలుపుగోలు రాజకీయాలు చేస్తోందని, ప్రతిపక్షాలు మాత్రం విభజన, నకారాత్మక రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రతిపక్షాల తీరుకు కారణం బీజేపీకి బలం పెరుగుతుండటమేనన్నారు. ప్రజల ఆశీర్వాదాలు, కార్యకర్తల కృషి కారణంగానే తమ పార్టీ బలోపేతమవుతోందని చెప్పారు. ఈ వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, బీజేపీ నేత అనంత్ కుమార్ విలేకర్లకు తెలిపారు. తమ పార్టీ ‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి’ యాత్రను నిర్వహిస్తుందన్నారు.