జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పాలన చెయ్యటం చేతకాదు అంటూ, ఎర్రచందనం స్మగ్గ్లింగ్ అరికట్టటంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారు అంటూ, పవన్ చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిందే... అదేమంటే, ఎవరో మాట్లడారు అందుకే నేను ఆరోపణలు చేసాను అని చెప్తున్నాడు పవన్... అయితే, పవన్ చేసిన ఆరోపణలకు, చెంపపెట్టు నిన్న లోక్‌సభలో అటవీశాఖ సహాయ మంత్రి ఇచ్చిన సమాధానం... రాష్ట్రంలో చంద్రబాబు వచ్చిన తరువాత ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలా అరికట్టింది అందరూ చూసారు.. కాని పవన్ మాత్రం, ఎందుకు, ఏమి మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడుతూ, ప్రజలని పిచ్చోళ్ళను చేస్తున్నాడు..
అయితే, ఇలాంటి గాల్లో మాటలు మాట్లాడేవారికి, సమాధానమా అన్నట్టు, లోక్‌సభలో అటవీశాఖ సహాయ మంత్రి సమాధానం ఇచ్చారు... ఆంధ్రప్రదేశ్‌లో మూడేళ్లలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో 8,674 మందిని అరెస్టు చేసినట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయమంత్రి మహేష్‌శర్మ తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో రాష్ట్ర ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, కొత్తపల్లి గీతలు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ అంశంపై మూడేళ్లలో 2,540 కేసులు నమోదయ్యాయని, 1,203.62 మె.టన్నుల సరుకు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 1,865 వాహనాలను కూడా సీజ్ చేసినట్లు వెల్లడించారు. సరకు విలువ రూ.47.53 కోట్లు ఉంటుందన్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్‌తో సంబంధం ఉన్న అన్ని వాహనాలను ఏపీ అటవీ చట్టం-1967లోని నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశామన్నారు. 2015-16లో 753 కేసులు నమోదు కాగా, 2,587 మందిని అరెస్ట్ చేసారు... అలాగే 480 వాహనాలు సీజ్ చేసారు.. 355.658 మె.టన్నుల సరుకు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 2016-17లో 911 కేసులు నమోదు కాగా, 3,344 మందిని అరెస్ట్ చేసారు... అలాగే 705 వాహనాలు సీజ్ చేసారు.. 487.632 మె.టన్నుల సరుకు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 2017-18లో 876 కేసులు నమోదు కాగా, 2,743 మందిని అరెస్ట్ చేసారు... అలాగే 680 వాహనాలు సీజ్ చేసారు.. 360.338 మె.టన్నుల సరుకు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు... ఈ సమాధానం చుసైనా చెప్పండి పవన్ గారు...