అనుకున్నదే అయ్యింది... 56 అంగుళాల ఛాతీ, ఆంధ్రోడి దెబ్బకు నెల రోజుల నుంచి పారిపోతూ ఉండటం చూసాం... పార్లమెంట్ సమావేశాల చివరి రోజు కూడా, చర్చ జరపుండా, నిరవధిక వాయిదా వేసుకుని పారిపోయారు... నీ పై విశ్వాసం లేదు, నీ పరిపాలన పై విశ్వాసం లేదు అని, గత నెల రోజుల నుంచి, అన్ని విపక్షాలు ఏకమై, ఆందోళన చేసినా, చర్చకు ముందుకు రాలేక, పారిపోయారు... ప్రజాస్వామ్యం దేశంలో, సిగ్గు పడేలా, నీ పై విశ్వాసం లేదు అని చెప్తున్నా, అది ఎదుర్కునే దమ్ము లేక, కొన్ని పార్టీలతో డ్రామాలు ఆడించి, రోజుకి పది నిమషాలు కూడా సభ జరపకుండా పారిపోతూ వస్తున్నారు... చివరకు, చివరి రోజు కూడా ఇలాగే పారిపోయారు...

modi 06042018 1

మొదట్లో వైసిపీ అవిశ్వాసం నోటీసుకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తాను అని చెప్పింది... అప్పటికి, ఇంకా దేశంలోని ఏ పార్టీ కూడా వైసిపీ అవిశ్వాసానికి మద్దతు ఇవ్వలేదు... కాని, ఒక పక్క అవిస్వాసం అంటూ, మరో పక్క అదే నోటీసు పట్టుకుని విజయసాయి రెడ్డి ప్రధాని ఆఫీస్ కి వెళ్ళటంతో, వెంటంటే చంద్రబాబు అలెర్ట్ అయ్యారు... వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు అని తెలుసుకుని, వెంటనే వారే అవిశ్వాసం పెట్టారు... అంతే, చంద్రబాబు అవిశ్వాసం పెట్టిన గంటలో, దేశంలో అన్ని విపక్షాలు, చంద్రబాబుకి మద్దతు ప్రకటించాయి... ఇదే మోడీ పతనానికి మొదటి అడుగు... అప్పటి నుంచి, పారిపోతూనే ఉన్నారు...

modi 06042018 1

అవిశ్వాసాని భయం లేదంటూనే, బీజేపీ ఇలా డ్రామాలు ఆడిస్తుంది అని, విపక్షలాన్నీ అంటున్నాయి... అయినా మాకు సంపూర్ణ బలం ఉంది అని చెప్పుకుంటున్న బీజేపీ, ఎందుకు వెనకడుగు వేసింది ? వీళ్ళు చేసిన పనులు అన్నీ, బయట పడతాయనా ? అన్ని రాష్ట్రాల వారు, మోడీ పై విరుచుకుపడితే వీరిఇమేజ్ దెబ్బతింటుంది అనా ? ఒక పార్టీ ఎంపీలు ఆందోళన చేస్తుంటే, వారిని సస్పెండ్ చేసి సభ నడపలేరా ? అసలు వింత ఏంటి అంటే, సందట్లో సడేమియ్యా.. నా పేరు బుడే మియ్యా ... అన్నట్టు, ఇంత గోలలోనూ కావలిన బిల్లులు పాస్ అయిపోయాయి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read