సామాన్యంగా కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) కాగ్ రిపోర్ట్ వస్తుంది అంటే, ప్రతిపక్షాలకి పండగే... ప్రభుత్వం పై వారు చేసే ఆరోపణలకి, కాగ్ రిపోర్ట్ తోడైతే, ప్రభుత్వాన్ని ఒక ఆట ఆడుకుంటారు... పోయిన వారం తెలంగాణ కాగ్ రిపోర్ట్ చూసాం... అవినీతి జరుగుతుంది అని, నిధులు దుర్వినియోగం అని, తెలంగాణా ప్రభుత్వాన్ని ఏకి పడేసింది కాగ్... అయితే, మన రాష్ట్ర కాగ్ రిపోర్ట్ కూడా త్వరలో వస్తుంది, చంద్రబాబుని ఒక ఆట ఆడుకోవచ్చు అని జగన్, పవన్, బీజేపీ కాచుకుని కూర్చున్నారు... కాని వారి ఆశల పై కాగ్ నీళ్ళు చల్లింది... కొన్ని సహజమైన కామెంట్స్ మినిహా, అవినీతి పై కాని, నిధుల దుర్వినియోగం పై కాని ఒక్కటంటే ఒక్క మాట కూడా రిపోర్ట్ లో లేదు...

cag 07042018 1

ఈ రిపోర్ట్ తో మరో సారి చంద్రబాబు ఎంత పారదర్సాకంగా పని చేస్తున్నారో అర్ధమవుతుంది... రియల్ టైం గవర్నెన్స్ ద్వారా, ఎక్కడా అవినీతికి తావు లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు... ఈ రిపోర్ట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న వీరికి, మరో దెబ్బ కూడా వేసింది కాగ్.. ఆంధ్రప్రదేశ్‌కు సాయం విషయంలో కేంద్రం చెబుతోంది అబద్ధాలేనని కాగ్‌ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు పూర్తిస్థాయిలో రావడం లేదని తన నివేదికలో పేర్కొంది... మరి ఈ రిపోర్ట్ పట్టుకుని, కేంద్రాన్ని నిలదేసే దమ్ము పవన్, జగన్ కు ఉందా ? ఇంతకీ కాగ్, కేంద్ర సాయం పై ఏమి చెప్పిందో చూడండి..

cag 07042018 1

2016-17లో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.26,264 కోట్లు వచ్చాయి. బడ్జెట్‌ అంచనాల కంటే ఇవి రూ.1,627 కోట్లు తక్కువ. ఫలితంగా రాష్ట్రం తన అవసరాల కోసం రుణాలపై ఆధారపడుతోందని.. ఇటువంటి ధోరణి వల్ల కొంత కాలానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్రమేణా బలహీనమయ్యే ప్రమాదం ఉందని కాగ్‌ హెచ్చరించింది. రాష్ట్ర విభజన తర్వాత పట్టణ స్థానిక సంస్థలకు 13వ ఆర్థిక సంఘం గ్రాంట్లలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్‌కు రూ.818.36 కోట్లను కేటాయిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. సదరు గ్రాంట్లు కేంద్రం నుంచి వస్తాయన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం నిధులను పట్టణ, స్థానిక సంస్థలకు ముందుగానే విడుదల చేసింది. అయితే, కేంద్ర సర్కారు నుంచి ఆశించిన దానికంటే రూ.185.21 కోట్ల మేర నిధులు తక్కువ విడుదలయ్యాయి. 14వ ఆర్థిక సంఘం కేటాయింపుల ప్రకారం రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు 2016-17లో రూ.2,089.18 కోట్ల నిధులు రావాలి. కానీ రూ.2065.53 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఇంకా రూ.23.65 కోట్లు రావాల్సి ఉంది. ఇలా నిధుల్లో కేంద్రం కోత విధించడంవల్ల ఆ ప్రభావం రాష్ట్ర బడ్జెట్‌పై పడుతోందని కాగ్‌ పేర్కొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read