ఈ రోజు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం... రెండు సీట్లతో మొదలైన బీజేపీ, ఇప్పుడు ఈ స్థానానికి రావటానికి, అద్వానీ, వాజ్ పాయి, వేసిన పునాదులు మర్చిపోకూడదు... ఇక అమిత్ షా, మోడీ హాయం వచ్చిన తరువాత, అంతా ఫేక్ ప్రాపగండా... అహంకారంతో, ఏమి కనిపించకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు.. ఈ రోజు అమిత్ షా మాట్లాడిన మాటలు, వీరు ఎంత అహంకారంతో ఉన్నారు అనటానికి ఒక ఉదాహరణ... బీజేపీ 38వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ, ప్రతిపక్షాలను కుక్కలు, పిల్లులు, పాములతో పోల్చారు. వరదలు వచ్చినపుడు కుక్కలు, పిల్లులు, పాములు చెట్లపైకి ఎక్కిపోయి, తమను తాము కాపాడుకుంటాయన్నారు.
2019 ఎన్నికల్లో ప్రధాని మోదీ ఉధృతిని తట్టుకోలేక విపక్షాలన్నీ థర్డ్ ఫ్రెంట్ పేరుతో ఏకమవ్వాలని చూస్తున్నాయన్నారు. మోదీ ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, టీడీపీ, టీఆర్ ఎస్ ఇలా అన్నీ జంతువులు కూడా ఒక చెట్టు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నాయని వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. మాకు ఎదురు లేదు అంటూ, ప్రతిపక్ష పార్టీలని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ, అహంకారపు మాటలు మాట్లాడుతున్నారు... తిరిగే ఇదే భాషలో, చెప్పాలి అంటే, మీ బీజేపీ వాళ్ళని ఏ జంతువుతో పోల్చాలి అమిత్ షా గారు ?
ఇదేంత అహంకార పూరిత స్టేట్మెంట్ ఆంటే 2 సీట్ లు ఉన్నప్పుడు మీరు కూడా ఇంతే... కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ బలంగా ఉన్నప్పుడు, మీ మోడీ, గుజరాత్ వదిలి బయటకు రావాలి అంటే భయపడే వారు... చరిత్ర మర్చిపోయి, మనం ఎక్కడ నుంచి వచ్చామో మర్చిపోయి విర్రవీగితే, ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు... మళ్ళీ రెండు సీట్లలోకి పడిపోవటానికి ఎంతో కాలం పట్టదు.. అహంకారం మానండి... ప్రతిపక్షాలు కుక్కలు, పిల్లులు, పాములు అయితే, మిమ్మల్ని కూడా ఎదో ఒక జంతువుతో పోలుస్తారు... మీ స్థాయికి, ఇంత దిగజారి మాట్లాడితే, అంతకంటే దిగాజారి మిమ్మల్ని మాట్లాడే వారు ఉంటారు.. కొంచెం అహంకారం తగ్గించుకోండి సార్...