ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు... కేంద్రం ఎంతకూ దిగి రాకపోవటంతో, ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు... ఇందుకోసం, ముందుగా ప్రజల్లోకి వెళ్ళాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు... అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే జనంలోకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించుకున్నారు. జిల్లాల్లో పర్యటించి తాజా పరిణామాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నారు. కేంద్ర వ్యవహరించిన తీరు, రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని నేరుగా ప్రజలకు వివరించేందుకు ముఖ్యమంత్రి స్వయంగా ప్రజల్లోకి వెళ్లనున్నారు.
రాష్ట్రంలో అనూహ్యంగా మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రజల్లో కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని వివరించి, తమ వాదన వినిపించేందుకు ఇదే సరైన సమయమని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం... కొన్ని చానల్స్ లో పాదయాత్ర అనే వార్తలు వస్తున్నా, అది కుదరకపోవచ్చు అని తెలుస్తుంది... బస్సు యాత్ర ద్వారానే ప్రజల వద్దకు చంద్రబాబు వచ్చే అవకాసం ఉంది... ఎదో జిల్లాల పర్యటన కాకుండా, ఒక యాత్ర ద్వారానే, జిల్లాలు చుట్టి వచ్చే అవకాసం ఉంది..
కేంద్రం చేస్తున్న అన్యాయంతో పాటు, రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారం తిప్పి కొట్టటం, అలాగే జగన్ ఆడుతున్న డ్రామాలు ప్రజల వద్దకు వెళ్లి, వారికే వివరించనున్నారు... అలాగే అప్పుడు హోదా వద్దని, ప్యాకీజికి ఎందుకు ఒప్పుకున్నారు, తరువాత కేంద్రం ఎలా మోసం చేసింది, మిగలిన రాష్ట్రాలకు హోదా ఇస్తున్నప్పుడు, మనకు ఎందుకు ఇవ్వరు అంటూ అడుగుతున్న అంశాల పై, ఈ యాత్రలో చంద్రబాబే స్వయంగా ప్రజలకు వివరించనున్నారు..