ముఖ్యమంత్రి చంద్రబాబు రోజు రోజుకీ స్వరం పెంచుతున్నారు... ఢిల్లీ పై జరుగుతున్న పోరాటంలో, వారు ఆడుతున్న నాటకాలని బయట పెడుతున్నారు... రాష్ట్రంలో మోడీ పేరు చెప్పి మరీ, విమర్శలు చేస్తున్నది చంద్రబాబు ఒక్కరే... ఈ రోజు కూడా, ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తూ, తీవ్ర వ్యాఖ్యలు చేసారు... ఆర్థిక నేరస్థులు ప్రధానిని కలవడం ఎక్కడైనా ఉందా ? అలాగే పీఎంవో చుట్టూ ఏ2 నిందితుడి ప్రదక్షిణలు ఏం సంకేతాలు పంపిస్తున్నాయి..? అంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని, పీఎంవోని ఉద్దేశించి పేర్కొన్నారు.... ఒకవైపు విశ్వాసం ఉందంటారు,మరోవైపు అవిశ్వాసం పెడతామంటారా అని ఆయన ఆగ్రహాం వ్యక్తంచేశారు. ఎందుకీ డ్రామాలు...?నాటకాలు...అని ప్రశ్నించారు.

cbn pmo 13032018 2

ప్రజలు వైకాపాను అసహ్యించుకునే రోజు దగ్గరలోనే ఉందన్నారు. తెదేపా ఎంపీలు కలిసికట్టుగా ఉండి..చిత్తశుద్ధితో పోరాటం చేయాలని హితవు పలికారు. ఇది కీలక సమయమని...సభకు ఎవరూ గైర్హాజరు కావొద్దని కోరారు. కేంద్రం నుంచి ఎంత వచ్చింది, ఇంకా ఎంత రావాలి అనే వివరాలను ఆన్ లైన్‌లో ఉంచామని తెలిపారు. ఈ సమాచారాన్ని ఎంపీలు వినియోగించుకోవాలన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తెదేపా ఎంపీల పోరాటం ఉండాలని... పార్లమెంటులో ఇతర పార్టీల ఎంపీలను కూడా సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఆ రోజు సెంటిమెంటుకు ప్రత్యేక రాష్ట్రమే ఇచ్చారన్నా ముఖ్యమంత్రి.. ఈ రోజు సెంటిమెంటు చూసి డబ్బులు ఇవ్వలేమంటారా? అని ప్రశ్నించారు. ఇదేం న్యాయం.. అని మండిపడ్డారు.

cbn pmo 13032018 3

ప్రజల తరఫునే ప్రతినిధులు నిలబడాలని...,ప్రజల గొంతు పార్లమెంటులో ప్రతిధ్వనించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. 5 కోట్ల ప్రజల మనోభావాలపై కేంద్రం ఉదాసీనత భావ్యంకాదన్న ముఖ్యమంత్రి ....అభివృద్ధి ఆగిపోకుండా పోరాటం నిర్మాణాత్మకంగా జరగాలన్నారు. మన హక్కులలో రాజీలేదని, ప్రత్యేక హోదా తమ హక్కు.. ఎందుకివ్వరు? అని ప్రజలు భావిస్తున్నారని సీఎం తెలిపారు. పునర్వవస్థీకరణ చట్టం, హామీల అమలుపై ఈ రోజు శాసనసభలో ప్రత్యేక తీర్మానం చేయనున్నట్లు సీఎం తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read