శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా, కేంద్రం చేస్తున్న అన్యాయం చెప్తూనే, జగన్ ఆడుతున్న డ్రామాలు కూడా, శాసనమండలి వేదికగా చంద్రబాబు బహిర్గతం చేసారు... ప్రతిపక్ష వైయస్ఆర్సీపీ ద్వంద వైఖరి అవలంబిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు... ఒకరు విశ్వాసం అంటారు, ఇంకొకరు అవిశ్వాసం అంటారు అంటూ, వైయస్ఆర్సీపీ వైఖరిని ఎండగట్టారు... మోదీపై విశ్వాసం ఉందంటూనే ఆయన పై అవిశ్వాసం ఎలా పెడతారని ఎద్దేవా చేశారు... ప్రజలు వీళ్ళు ఆడుతున్న డ్రామాలు అర్ధం చేసుకోవాలని అన్నారు...
ప్రత్యేక హోదా కోరుతూనే.. అది మోదీ వల్లే సాధ్యమవుతుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారు... మోదీపై విశ్వాసం ఉందని చెబుతూనే ఆ పార్టీ కేంద్రం అవిశ్వాసం పెడతామంటోంది.... దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ? ప్రజలు అమాయకులా అంటూ, మండిపడ్డారు... మళ్ళీ ఇలాంటి పనులకి తెలుగుదేశం మద్దతు ఇవ్వలంటున్నారు.... అవిశ్వాసానికి టీడీపీ మద్దతివ్వాలనడం హాస్యాస్పదమని కొట్టి పారేశారు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో తమకు తెలుసని అన్నారు... ఆంధ్రప్రదేశ్ కోసం, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అవి తీసుకుంటామని, రాజకీయాలు కోసం ఇప్పుడు ఆలోచించమని, అవి ఎన్నికలప్పుడు చూసుకుంటామని అన్నారు...
తమకు ఎవరిపైనా కోపం లేదని, ఎవరితోనూ వైరం పెట్టుకునే ఆలోచన లేదని అన్నారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, వాటి కోసం అందరితోనూ సఖ్యతతో వ్యవహరిస్తామని చంద్రబాబు అసెంబ్లీలో స్పష్టం చేశారు. చాలా అంశాల్లో కేంద్రం సహకరించకపోయినా, భారమైనా సరే రాష్ట్రం ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. ఆర్బీఐ ఒప్పుకోకపోయినా రైతు రుణమాఫీ చేశాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.. విభజన చట్టంలో ఉన్న వాటినే అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామే తప్ప వ్యక్తిగతంగా ఏమీ కోరడం లేదన్నారు....