ఆంధ్రప్రదేశ్ విభజన హామీల్లో రూపాయి ఖర్చు లేనిది, కేవలం మోడీ నిర్ణయం తీసుకుంటే అయిపోయేది ఏదన్న ఉంది అంటే, అది వైజాగ్ రైల్వే జోన్.. అయితే ఇప్పుడు దీన్ని కూడా పక్కన పడేసింది కేంద్రం... మొన్నటి దాక, అదిగో రైల్వే జోన్, ఇదిగో రైల్వే జోన్ అంటూ ఊరించారు... రెండు రోజుల క్రితం బీజేపీ ఎమ్మల్యే విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో, రైల్వే జోన్ తీసుకువచ్చి తీరుతాం, మా కేంద్రం పై, మాకు నమ్మకం ఉంది అంటూ, హడావిడి చేసారు... ఈ నేపధ్యంలో, ఈ విషయంలో రూపాయి ఖర్చు లేదు కాబట్టి, కనీసం ఇదైనా మన రాష్ట్రానికి వస్తుంది అని, అందరూ భావించారు.. కాని కేంద్రం, మన పై కక్ష కట్టింది... రైల్వే జోన్ లేదు అని తేల్చి చెప్పినట్టు సమాచారం...
ఈ రోజు ఢిల్లీలో, రాష్ట్ర అధికారులతో, కేంద్ర హోం శాఖ అధికారులు విభిజన అంశాల పై చర్చులు జరుపుతున్నారు... ఇవన్నీ రొటీన్ గా జరిగే సమావేశాలే. ప్రస్తుతం జరుగుతున్న విషయాలకి, ఈ సమావేశానికి సంబంధం లేదు... అయితే, ఈ సందర్భంలో రైల్వే జోన్ విషయం ప్రస్తావనకు రాగా, అందుబాటులో ఉన్న నివేదిక ప్రకారం రైల్వేజోన్ సాధ్యం కాదని ఏపీ సీఎస్ దినేష్‌కుమార్‌కు కేంద్ర హోంశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు... ఇదే సందర్భంలో, ఛీఫ్ సెక్రటరీ దినేష్‌కుమార్ ఇది సరి కాదు అని వారితో వాదనకు దిగినట్టు సమాచారం..
ఏపీకి రైల్వేజోన్ ఇచ్చేస్తున్నాం అని, ఒడిశాతో చర్చలుజరుపుతున్నామని, అవన్నీ ఒక కొలిక్కి వచ్చిన తరువాత, విశాఖ రైల్వేజోన్‌ను ప్రకటిస్తామని కొద్దిరోజుల క్రితమే కేంద్ర పెద్దలు స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగానే, కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ వైదొలిగింది. విభజన హామీలు నెరవేర్చాలని తెలుగుదేశం ఆందోళన చేస్తున్న నేపధ్యంలో, ఈ సమయంలోనే రైల్వేజోన్ ఇవ్వటం సాధ్యం కాదని పుండు మీద కారం చల్లింది.