అరేయ్ రోడ్డున పడేసారు రా, సహాయం చెయ్యండి రా అంటే, ఒకడికి మించిన, దగా ఇంకొకడు చేస్తాడు... కట్టు బట్టలతో రోడ్డున పడేసి, కనీసం రాజధాని కూడా లేకుండా, ఈ దేశం అత్యున్నత చట్ట సభలో, తలుపులు మూసి, లైవ్ ఆపేసి, ఒక రాష్ట్రాన్ని విడగోట్టాయి, ఈ దేశపు రాజకీయ పార్టీలు... తిరుపతి వెంకన్న సాక్షిగా, ప్రధాని అభ్యర్ధి హోదాలో, ఢిల్లీకి మించిన రాజధాని కట్టిస్తాం అన్నారు... ప్రపంచంలో అద్భుతమైన సిటీలు చూసి రండి, అలాంటి రాజాధాని కట్టుకుందాం అని చెప్పారు మోడీ... దగా పడ్డ ఆంధ్రుడు, మన దమ్ము ఏంటో ఈ దేశానికి చూపించటానికి, అమరావతి నిర్మాణం పూనుకున్నాం... 5 కోట్ల ఆంధ్రుల కోసం, 33 వేల ఎకరాలు త్యాగం చేసారు అమరావతి రైతులు...

dwaraka 10032018 1

మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ఏమి చేసింది ? నిధులు ఇవ్వటం లేదు... అందుకే రాష్ట్రం పోరాడుతుంది... బీజేపీ ఎందుకు నిధులు ఇవ్వటం లేదో చెప్పాలి.. రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఎమన్నా ఉందేమో చెప్పాలి.. కాని, బీజేపీ మదం చూసారా... మొన్న, బీ జె పీ అధికార ప్రతినిధి జీ వీ ఎల్ నరసింహారావు అమరావతి లో మయసభ కడ్తున్నారా , 43 వేల కోట్లు రాజధాని కి అవసరమా అని అవహేళన గా మాట్లాడు.... నిన్న సాక్షాత్తు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, సెంటిమెంట్ కు డబ్బులు ఇస్తారా అని వ్యంగంగా మట్లాడి తెలుగువారిని అవమాన పరిచారు... డీ పీ ఆర్ లు పంపలేదు అని అబద్ధాలు ఆడారు...

dwaraka 10032018 1

అమరావతి నిర్మాణానికి 43 వేల కోట్ల రూపాయలకు డీ పీ ఆర్ లు పంపితే, అందులో పొందుపరచిన అంశాలను చూడకుండా మయసభ నిర్మాణానికా అనడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానపరచడమే.. నవంబర్ 2017 లో పంపిన డీ పీ ఆర్ ల ప్రకారం : 11 వేల 602 కోట్లు రూపాయిలు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్ కు సంబందించినది , అందులో అసెంబ్లీ , సెక్రెటేరియట్ , రాజభవన్ , హెచ్ ఓ డీ తదితర నిర్మాణాలు , మినిస్టర్లు - ఏం ఎల్ ఏ లు , ఏం ఎల్ సి లు , రాజధానిలో పనిచేసే అధికారుల నివాసాలు కు సంబందించిన నిర్మాణాలు వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలకు సంబందించిన అంశాలు... 32 వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలు : కృష్ణ నది పై ఐకానిక్ వంతెన , రాజధానికి అవసరమైన రహదారులు , సీనరేజ్, డ్రైనేజీ , ఎలెక్ట్రిఫికేషన్ తదితర సామాజిక మౌలిక సదుపాయాలకు సంబందించినవి కేంద్రానికి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం... దీన్ని మయసభ అంటారా ?

dwaraka 10032018 1

కాని, మన బీజేపీకి, మోడీ గారికి, ద్వారకా కన్వెన్షన్ సెంటర్ నిర్మించటానికి, ఇవేమీ అడ్డు కాదు... 5 కోట్ల, ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కి 15వందల కోట్లు విదిల్చి, ద్వారకా కన్వెన్షన్ సెంటర్ నిర్మించటానికి 25,703 కోట్లు ఖర్చు పెడుతుంది కేంద్రం... దీనికి మొత్తం కేంద్రం ఫండింగ్ చేస్తోంది... 2025 లోపు ఇది పూర్తి చేస్తామంటుంది కేంద్రం... ఇప్పటికే 1500 కోట్లు కూడా ఇచ్చేసింది... మొత్తం ప్రాజెక్ట్ బిల్ట్ అప్ ఏరియా. 10.2 లక్షల చ మీ ..అంటే 1.09 కోట్ల చ.అడుగులు... మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ రూ 25,703 కోట్లు... అంటే చదరపు అడుగుకు దాదాపు రూ 22,500... మరి మొన్న ఒక రాష్ట్ర బీజేపీ నాయకుడు అంటున్నట్టు, చదరపు అడుగు రూ 700-1200 లో ఎందుకు కట్టటం లేదు ? అంతే కాదు, ఇక్కడకు మెట్రో కనెక్టివిటీ కోసం 800 కోట్లు కూడా కేటాయిస్తున్నారు... దానితో పాటు, ఇక్కడకు వచ్చే రోడ్లు అన్నీ అభివృద్ధి చేస్తున్నారు, కొత్త రోడ్లు వేస్తున్నారు...

ఒక కన్వెన్షన్ సెంటర్ కు 25వేల కోట్లు ఖర్చుపెడతానికి గుర్తుకురాని దేశ రక్షణ వ్యయం, మిగిలిన రాష్ట్రాలు, బాషల వాళ్ళు అడుగుతారు అనే భయం, కేవలం దక్షిణ భారత దేశంలోని ఒక తెలుగు రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన సొమ్ము ఇవ్వడానికి మీకు అన్ని అడ్డంకులు వస్తాయి??? ఈ లింక్ లో ఎన్విరాన్మెంట్ క్లేఅరెన్స రిపోర్ట్ ఉంది, మొత్తం చూడండి మైండ్ పోతుంది, ఇది ఎలాంటి ప్రాజెక్ట్ అనేది... http://environmentclearance.nic.in/writereaddata/FormB/EC/Additional_Report/150220176JXAKBG9Annexure-AdditionalReport.pdf

5 కోట్ల మంది రాజధాని, ఒక కన్వెన్షన్ సెంటర్ పాటి చెయ్యదా ? మేము కలలు రాజధాని కట్టుకుంటుంటే దీన్ని మయసభ అంటారా ? మీ ఢిల్లీ మదం దించుతాం... ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇలాగే విర్రవీగి పాతాళంలో ఉంది, ఇప్పుడు మీ వంతు... చివరగా, అమరావతి మయసభ కాదురా, దగా పడ్డ ప్రతి తెలుగోడి ఆత్మగౌరపు ఇంద్రసభ.. ఖబద్దార్ ఢిల్లీ పాలకులారా...

Advertisements

Advertisements

Latest Articles

Most Read