ప్రధాని మోడీ గురించి ఎవరో విమర్శలు చెయ్యకూడదు అంట... ఎవరన్నా విమర్శలు చేస్తే, వారి అంతు చూస్తారు అంట... వాళ్ళు ఎవరైనా సరే, వారిని వదిలే ప్రసక్తే లేదంట... సామాన్య ప్రజలు అయినా సరే, మోడీకి జీ హుజూర్ అనాల్సిందే అంట... లేకపోతే అంతు చూస్తాం అంటూ బెదిరిస్తున్నారు బీజేపీ గూండాలు... రెండు రోజుల క్రిందట, వ్యక్తిత్వ వికాస నిపుణుడు సి.నరసింహారావు గారు, మోడీ పై ఒక విశ్లేషణ చేసారు... మోడీ ఎలాంటి వాడు, ఎలాంటి పనులు చేసి, ఇంత వరకు వచ్చాడు, మోడీ చేసిన ఫేక్ ప్రచారం, ఆయన ఎలా పెద్దలను అణగదొక్కి మరీ ఇక్కడ వరకు వచ్చింది ఇలా అన్ని విషయాల పై ఒక కధనం రాసారు...
అది, ఆంధ్రజ్యోతి పత్రిక, ABN ఛానల్ లో వచ్చింది.. అయితే, ఇది తట్టుకోలేని బీజేపీ వాళ్ళు రెచ్చిపోయారు... హైదరాబాద్ లోని, ఆంధ్రజ్యోతి కార్యాలయం పై దాడి చేసి, సర్వ నాశనం చేస్తామంటూ హంగామా చేసారు.. ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధాన కార్యాలయాన్ని బీజేపీ నేతలు, కార్యకర్తలు ముట్టడించేందుకు యత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు.. రికేడ్లు ఏర్పాటు చేసి నిలువరించారు. బీజేపీ కార్యకర్తలు ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీపై కథనాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. బారికేడ్లను నెట్టుకుంటూ కార్యాలయం వైపు దూసుకొచ్చేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు.
దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు... ఇదే విషయం తెలుసుకున్న తెలంగాణా ప్రభుత్వం కూడా స్పందించింది.. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర బీజేపీ ఆందోళన చేయడాన్ని ఖండించారు. ఇది ముమ్మాటికి మీడియా స్వేచ్ఛను హరించడమేనని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియాకు స్వేచ్ఛ ఉందని, దానిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు... మరో పక్క సి.నరసింహారావు గారు రాసింది రాజకీయ విశ్లేషణ కాదుఅని, అది పక్కాగా మానసిక విశ్లేషణ అని, దీని కోసం ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారో అని, రాజకీయ పరిశీలకలు అంటున్నారు..