ఢిల్లీ వేదికగా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే రంగంలోకి దిగి విభజన హామీల పై పోరు మొదలుపెట్టారు... విభజన హామీలను నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టేందుకు పావులు కదుపుతున్న ముఖ్యమంత్రి… ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు, రేపు అక్కడే ఉండే భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పార్టీల నేతలతో సమావేశం అవుతున్నారు... ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని అన్ని పార్టీల నేతలకు వివరించి… అవిశ్వాసానికి అండగా నిలవాలని కోరతున్నారు... హిందీ, ఇంగ్లిష్‌లలో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక పుస్తకం తయారు చేసింది. ఆ ప్రతులను చంద్రబాబు వారికి అందిస్తున్నారు...
ఈ సందర్భంగా, చంద్రబాబు బీజేపీ సీనియర్ నేత, ఎంపీ అయిన మురళీ మనోహర్ జోషిని పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో కలిసారు... అలాగే ఎన్డీఏలో మరో భాగస్వామి అయిన, అకాలీ దళ్ పార్టీ నేత, నరేష్ గుజ్రాల్ ని కూడా కలిసారు.. ముగ్గురు కలిసి చాలా ఉల్లాసంగా మాట్లాడుకున్నారు... ఈ సీన్ చుసిన వారందరూ, సొంత పార్టీ నేతలు, బీజేపీతో పొత్తు ఉన్న పార్టీలే చంద్రబాబుని కలిసన విషయం చూస్తుంటే, అందుకే మోడీ అవిశ్వాసానికి భయపడుతున్నాడు అంటున్నారు... ఇప్పటికే అద్వానీ వర్గం ఎంపీలు, మోడీ పై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే... మరో ఇద్దారు ఎంపీలైన శత్రుఘ్న సిన్హా, యశ్వంత్ సిన్హా, బహిరంగంగానే మోడీ పై విమర్శలు చేస్తున్నారు... మొత్తానికి చంద్రబాబు అమిత్ షా, మోడీలకు ఒక జర్క్ ఇచ్చారు.. ఇక ఇదే ఊపులో, అద్వానీని కూడా కలిస్తే, అసల మజా అప్పుడు ఉంటుంది...
చంద్రబాబు ఇప్పటికే, అన్నాడీఎంకే నేత వేణుగోపాల్, ఎన్‌సీపీ నేతలు శరద్ పవార్, సుప్రియా సూలె, తారిక్ అన్వర్, టీఎంసీ నేతలు సుదీప్ బందోపాధ్యాయ, డెరిక్ ఒబ్రెయిన్, సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌గోపాల్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, తెరాస నేత జితేందర్‌రెడ్డి తదితరులతో సమావేశమై చర్చించారు. విభజన చట్టం అమలుపై 72 పేజీల నివేదికను వారికి అందజేశారు. విభజన వల్ల ఏపీకి కలిగిన నష్టం, దాని భర్తీకి కేంద్రం విభజన చట్టంలో పెట్టిన హామీలు, అవి కాక పార్లమెంట్ వేదికగా ఇచ్చిన వాగ్దానాలు... అవి అమలైన తీరు తదితర సమాచారాన్ని ఇందులో పొందుపర్చారు...