ఈ రోజు కూడా, పార్లమెంట్, రాజ్యసభలో అదే సీన్ రిపీట్ అయ్యింది... రేపటితో పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి.. అయితే దేశంలోని అన్ని విపక్ష పార్టీలు, కేంద్రం పై నిరసనల హోరు పెంచాయి... అయినా కేంద్రం ఏ మాత్రం దిగి రావటం లేదు... ఈ రోజు కూడా అవిశ్వాసం పై చర్చ లేకుండా, సభ వాయిదా వేసుకుని వెళ్ళిపోయారు... రాజ్యసభలో కూడా సభ వాయిదా పడింది.. అయితే, ఇక్కడ మాత్రం , వాయిదా పడినా టీడీపీ ఎంపీలు సభలోనే కూర్చుని విభజన హామీలు నెరవేర్చాలని ఫ్లకార్డులతో నినాదాలు చేశారు... సభ జరగాలని, విభజన హామీల పై చర్చ చేపట్టాలని, ఇలా వాయిదా వేసుకుని వెళ్ళిపోవటం ఏంటి అని, టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు...
తెదేపా సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహనరావు, కనకమేడల రవీంద్రకుమార్, సీతారామలక్ష్మిని సభ నుంచి బయటకు రావని, చర్చ చేపట్టే వరకు ఇక్కడే ఉంటామని, ఆందోళన కొనసాగిస్తున్నారు... అయితే వారిని బయటకు రమ్మని ఎంత చెప్పినా వినకపోవటంతో, రాజ్యసభ సిబ్బంది, మార్షల్స్ రంగంలోకి దిగారు... దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి... ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వచ్చేది లేదని తెదేపా ఎంపీలు స్పష్టం చేయడంతో ఉద్రిక్తత కొనసాగుతోంది... అయితే, మరి కాసపెట్లో, వారిని బలవంతంగా, బయటకు తీసుకువస్తారా, లేక కేంద్ర ప్రభుత్వం ఏమన్నా చర్చలకు వస్తుందా అనేది చూడాలి...
మరో పక్క, రాజ్యసభ ఎంపీలకు సంఘీభావంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో టీడీపీ లోక్ సభ సభ్యులు కూడా ధర్నా చేపట్టనున్నారని సమాచారం... పార్లమెంట్ సమావేశాలకు మరో రోజు మాత్రమే మిగిలి ఉంది. అవిశ్వాసంపై చర్చ రాకుండానే లోక్సభ వాయిదాలు పడుతూ వచ్చింది. శుక్రవారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని, చర్చ జరగకపోవచ్చునని ఢిల్లీలో టాక్ నడుస్తుంది.. 21 రోజులగా ఉభయ సభలు, కనీసం రోజుకి ఒక 15 నిమషాలు కూడా జరగలేదు... అవిశ్వాసం పెట్టినా, ఎదుర్కునే దమ్ము లేక, మోడీ ప్రభుత్వం పారిపోతుంది...