కేంద్రం పార్లమెంట్ లో అనుసరిస్తున్న విధానం పై, దేశంలోని అన్ని విపక్షాలు ఏకం అయ్యాయి... అవిశ్వాసం పై చర్చ జరపకుండా, కేంద్రం గత నెల రోజులుగా ఎలా పారిపోతుందో చూస్తున్నాం... ఇలా సభ మొదలు అవ్వటం, ఒక్క నిమషం కూడా జరగకుండా వాయిదా పడటం, మళ్ళీ 12 గంటలకు ఇదే తీరు... ఒకే ఒక పార్టీ అడ్డు వస్తుంది అంటూ, నెల రోజులుగా పార్లమెంట్ వాయిదా వేస్తున్నారు... వారిని సుస్పండ్ చేసి, అవిశ్వాసం పై చర్చ చేపట్టండి అంటే మాత్రం, అది చెయ్యటం లేదు... ఎందుకంటే, బీజేపీ నే వారి చేత, ఆడిస్తుంది కాబట్టి... ఇలా ప్రతి రోజు జరుగుతుంది... ఇంకా రెండు రోజులే సమయం ఉంది...
దీంతో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా, పార్లమెంట్ ప్రాంగణంలో దేశంలోని అన్ని విపక్ష పార్టీల ఎంపీలు నిరసనగా మానవహారం నిర్వహించారు... రాజ్యసభ ఛైర్మన్ కార్యాలయం నుంచి ప్రధాని కార్యాలయం వరకు మానవహారం నిర్వహించారు .. కేంద్ర ప్రభుత్వం పనితీరుకు నిరసనగా మానవహారం కార్యక్రమం చేపట్టారు.. అయితే, ఈ మానవ హారంలో మన రాష్ట్రానికి చెందిన వైసీపీ పార్టీ మాత్రం ఇందులో పాల్గున లేదు... మరో పార్టీ అన్నాడీఎంకే కూడా రాలేదు... అన్నాడీఎంకే, వైసీపీ మినహా విపక్షాల అన్నీ ఈ మానవహారంలో పాల్గున్నాయి...
అంటే, ఈ రెండు పార్టీలు బీజేపీ తో కలిసి పోయాయి అనే దానికి, మరో ప్రత్యేక్ష ఉదాహరణ... అన్ని పార్టీలు ఏకం అయ్యి, దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు పాల్గున్న నిరసనలో, వైసీపీ పార్టీ ఎందుకు పాల్గునలేదు అంటే, ఇక్కడే వారు ఎలా సరెండర్ అయ్యారో అర్ధమవుతుంది... మోడీ మీద అవిశ్వాసం అంటూ, మోడీ ఆఫీస్ లోనే విజయసాయి రెడ్డి 24 గంటలు ఉంటున్నారు... మోడీని ఒక్క మాట కూడా అననివ్వటం లేదు... ఎమన్నా అంటే, నోటీసులు పంపిస్తున్నారు... ఇది వీరి తీరు... రాష్ట్రం మొత్తమే కాదు, దేశం మొత్తం మోడీ వైఖరి పై యుద్ధం చేస్తుంటే, వీరు మాత్రం భయపడుతూ తిరుగుతున్నారు...