తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానంతో, మోడీ - అమిత్ షా కు చికాకు తెప్పిస్తుంది... వైసిపీతో అవిశ్వాసం పెట్టించి, ఎదో గేమ్ ఆడదాం అనుకున్నారు... కాని, వీరి ఇద్దరి కుట్రలు పసిగట్టిన చంద్రబాబు, వెంటనే తన పార్టీ చేతే అవిశ్వాసం పెట్టించారు... ఇక ఇంతే, ఒక్క గంటలో దేశ రాజకీయం మారిపోయింది... తెలుగుదేశం అవిశ్వాస తీర్మానానికి అన్ని విపక్షాలు మద్దతు తెలిపాయి... 4 ఏళ్ళలో ఎప్పుడూ కలవని విపక్ష పార్టీలు, చంద్రబాబు లాంటి నాయకుడు ముందుకు రావటంతో, అందరూ ఏకం అయ్యారు... దీనికి తోడు, బీజేపీ లో ఉన్న అద్వానీ వర్గం ఎంపీలు కూడా, చంద్రబాబుకు మద్దతు పలికే అవకాసం ఉందని సమాచారం...
ఈ సమాచారంతో, మోడీ - అమిత్ షా, రిస్క్ తీసుకోవటం లేదు... మెజారిటీ ఉన్నా, ఎందుకో భయపడుతున్నారు... ముఖ్యంగా, అవిశ్వాసం కనుక పెడితే, దేశంలోని ప్రతి పార్టీ, మోడీ మీద ఎక్కి దిగుతుంది... మోడీ విధానాలని, వివక్షను ఎండగడతారు... ఇక అవిశ్వాసం పెట్టిన తెలుగుదేశం పార్టీకి, ఎక్కువ సమయం ఉంటుంది.. మోడీ మనకు చేసిన మోసాలు, పూర్తి ఆధారాలతో బయట పెడితే, ఇక మోడీ ఇమేజ్ గోవిందా... అందుకే, ఎలా చెయ్యాలో, ఏమి చెయ్యాలో అర్ధం కాక, రోజు సభ వాయిదా వేసుకుని పారిపోతున్నారు... దీని పై తీవ్ర విమర్శలు వస్తుండటంతో, మరో ఎత్తుగడతో ముందుకు వస్తున్నారు...
ప్రతిపక్షాల అవిశ్వాసం కాదు, బీజేపీనే విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టబోతోంది అని ఢిల్లీలో వార్తలు వస్తున్నాయి... ఇలా తామే విశ్వాస తీర్మానం పెడితే, తాము చేసింది డబ్బా కొట్టుకోవచ్చు... లక్ష కోట్లు ఇచ్చాం అని ఎలా చెప్తున్నారో, అలా డబ్బా కొట్టుకుని, టైం వేస్ట్ చేస్తూ ఉంటారు.. ప్రతి పక్షాలకి, ఒక్కో పార్టీకి 3-5 నిమషాలు మాత్రమే ఇస్తారు... ఇలా తమ వైఫల్యాల పై ఎక్కువ ఫోకస్ లేకుండా, చర్చ అంతా తాము ఇది చేసాం అది చేసాం అని చెప్తూ, కాంగ్రెస్ మీరు చెయ్యలేదు అని చెప్తూ, ఇలా సాగనుంది.. వివిధ రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు, వారి సమస్యలు చెప్పే టైం ఉండదు... ఇది బీజేపీ ప్లాన్ గా చెప్తున్నారు... ఈ విధంగా, మేము ఎదో పోడిచేసాం అని చెప్పుకుని, ప్రతిపక్షాలని కార్నెర్ చేస్తారు.. ఈ విశ్వాస తీర్మానానికి మాత్రం, తెరాస, అన్నాడీయంకే ఎంపీలు అడ్డు తగలరు... చూద్దాం ఏమి జరుగుతుందో...