బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు 9 పేజీల లేఖ రాశారు... తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ నుంచి బయటకు వస్తూ చంద్రబాబు రాసిన లేఖకు అమిత్‌షా సమాధానం అంటూ, ఈ లేఖ మీడియాకు విడుదల అయ్యింది... అయితే, ఈ లేఖలో స్క్రిప్ట్ చూస్తే, ఇది ఒక జాతీయ అధ్యక్షుడు, అవగాహన ఉండి రాసిన లేఖలా లేదు... మన రాష్ట్రంలో ఉండే సోము వీర్రాజు, పురంధేశ్వరి లాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయో, అమిత్ షా రాసిన లేఖ అలా ఉంది... వాస్తవానికి దూరంగా, ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా, ఎవరో రాష్ట్రం నుంచి రాసిచ్చిన లేఖ పై, అమిత్ షా సంతకం పెట్టారా అనే అభిప్రాయం కలుగుతుంది...

amitshah 24032018 2

ముందుగా, తెదేపా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నా అని లేఖలో పేర్కొన్నారు. మీరు తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు... ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు, చంద్రబాబు ఎందుకు బయటకు రావట్లేదు అని గత సంవత్సరం నుంచి అడుగుతున్నారు... చంద్రబాబు మంత్రి వర్గం నుంచి బయటకు రావాలని, ఎన్డీఏ నుంచి బయటకు రావాలని, పవన్, జగన్, ఇలా అందరూ హడావిడి చేసారు... చంద్రబాబు ఒక పద్దతి ప్రకారం, కేంద్రం రియాక్ట్ అవ్వటానికి టైం ఇచ్చారు.. ముందుగా బడ్జెట్ అవ్వగానే కేంద్రం పై విరుచుకుపడ్డారు... నెల రోజులుకు పైగా సంప్రదింపులు జరిపారు... తరువాత మంత్రులు రాజీనామా చేసారు... అప్పటికీ కేంద్రానికి టైం ఇచ్చారు... చివరకు ఏది జరగకపోతే, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు...

amitshah 24032018 3

ఇక పొతే, అన్ని నిధులు ఇచ్చాం, ఇన్ని నిధులు ఇచ్చాం అంటూ, ఇన్నాళ్లు రాష్ట్ర బీజేపీ నేతలు ఏదైతే చెప్పారో, అదే సోది ఈ లేఖలో చెప్పారు... మరో పక్క యుసిలు ఇవ్వలేదు అంటూ, అందుకే సహాయం చెయ్యలేదు అని అమిత్ షా అన్నారు... యుసిలు ఏ రోజు ఇచ్చింది, చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు... దాంట్లో తప్పు ఉంటే, చంద్రబాబు సభను తప్పుదోవ పట్టించారని విష్ణు కుమార్ రాజు, స్పీకర్ కు నోటీసు ఇవ్వచ్చు... సరే, యుసిలు ఇవ్వలేదు అనే అనుకుందాం... ప్రత్యేక హోదా హామీకు, మరో 18 విభజన హామీలకు, యుసిలతో సంబంధం ఏముంది ? మీకు అంత చిత్తసుద్ధి ఉంటే, చట్టంలో పెట్టిన ఈ 18 హామీలు ఎందుకు నెరవేర్చలేదు ? ఇదే విషయం, మీకు స్క్రిప్ట్ రాసిచ్చిన వాడిని అడగండి, అమిత్ షా గారు... ఈ సారి, స్క్రిప్ట్ రైటర్ ని మార్చండి... కొంచెం వాస్తవాలు రాయండి... మేము మీరు ఆట ఆడుకున్న అన్ని రాష్ట్రాల వారి లాంటి వాళ్ళం కాదు.. ఆంధ్రులం... మాకు అన్నీ ఎక్కువే... మా మీదకు వచ్చే ముందు, కొంచెం పర్ఫెక్ట్ గా హోం వర్క్ చేసుకు రండి... అప్పుడు యుద్దం బాగుంటుంది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read