గత కొన్ని రోజులుగా పోలవరం పై, ఒక పధకం ప్రకారం ఎలాంటి కుట్ర పన్నారో చూస్తూనే ఉన్నాం... ఎలా అయినా పోలవరం ఆపాలని, ఆపరేషన్ గరుడ టీం మెంబెర్స్, ఢిల్లీలోనూ, మన రాష్ట్రంలోనూ (హైదరాబాద్ బ్యాచ్ అనుకోండి), ఎలాంటి మాటలు మాట్లాడారో చూసాం..... అయితే, పాపం ఆపరేషన్ గరుడ టీం మెంబెర్స్ కి, కేంద్రం వేసిన కమిటీనే దిమ్మ తిరిగే రిపోర్ట్ ఇచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం ఒక కమిటి నియమించింది.. అదే మసూద్ కమిటీ ... పోలవరం పనులు, పునరావాసం, ఇలా అన్ని విషయాల పై ఈ కమిటీ చూసి రిపోర్ట్ ఇవ్వాలి...
అయితే ఈ కమిటి ఎదో ఒక రిపోర్ట్ ఇస్తుందని, పోలవరం ఆపేసి, చంద్రబాబు పై సిబిఐ కేసు వేస్తారని హడావిడి చేసారు... అందుకే రెండు రోజుల నుంచి, ఈ ఆపరేషన్ గరుడ టీం మెంబెర్స్ అందరూ, దీని చుట్టూతా కామెంట్స్ చేసారు... అయితే, చంద్రబాబు నిజాయితీ, చిత్తసుద్ధి ముందు వీరి నాటకాలు పాటాపంచలు అయ్యాయి... ఈ రోజు, ఈ కమిటి రిపోర్ట్ ఇచ్చింది... నవయుగ కంపెనీ రంగంలోకి వచ్చాక పోలవరం పనులు వేగవంతమయ్యాయని, రోజుకు 4,800 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరుగుతున్నాయని మసూద్ కమిటీ తమ నివేదికలో పేర్కొంది. అంతేగాక నవయుగ కంపెనీ లక్ష్యాన్ని చేరుకుంటుందని కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది.
అలాగే పోలవరం ఆర్అండ్ఆర్పై మసూద్ కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. పైడిపాక గ్రామంలో లబ్ధిదారులతో మసూద్ కమిటీ సభ్యులు మాట్లాడారు. కాగా... పునరావాసంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారని కమిటీ పేర్కొంది. పోలవరం ప్రాజెక్టుపై మసూద్ కమిటీ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. పోలవరంపై మసూద్ కమిటీ నివేదికతో పరిహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు పటాపంచలయ్యాయి. అలాగే ఇప్పటికైనా పోలవరంపై విమర్శలు మానుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉండగా కాసేపట్లో అసెంబ్లీలో మసూద్ కమిటీ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.