సూటిగా సుత్తి లేకుండా మాట్లాడతారు... ఒకప్పుడు వైఎస్ జగన్‌కి అత్యంత ఆత్మీయుడు... జగన్ జైలుకు వెళ్లినప్పుడు పార్టీకి, ఆ కుటుంబానికి ధైర్యాన్నిచ్చిన మూలస్తంభం... జగన్‌లోని చీకటి కోణాలు తెలిసినా వైఎస్‌పై అభిమానంతో గుండెల్లోనే గుట్టుగా పెట్టుకున్న కమిటెడ్ లీడర్... రాష్ట్ర విభజన అనే అత్యంత హేయమైన గాయం విషయంలో జగన్ సోనియాతో రాజీపడటాన్ని సహించలేక పోయారు... జగన్ సోనియా మ్యాచ్‌ఫిక్సింగ్ వ్యవహారాన్ని బయటపెట్టారు... విశాఖలో విజయమ్మ గెలిస్తే లవ్‌లీ వైజాగ్ రక్తపాతంతో రగిలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు... వైజాగ్ లో జగన్, బ్యాచ్ ఎంటర్ అవ్వకుండా, ఆయన ప్రయత్నం చేసారు...
ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంతు... సబ్బం హరి లాంటి వాళ్ళు చెప్పారంటే, దాంట్లో ఎంతో కొంత వాస్తవం ఉండక పోదు అనే అభిప్రాయం ప్రజల్లు ఉంది... ఆ నాడు, సోనియా, జగన్ ను ఎలా ఆడించిందో, ఇప్పుడు పవన్ ని ,మోడీ ఎలా ఆడిస్తున్నారో చెప్పారు సబ్బం హరి... భారతీయ జనతా పార్టీ ప్రోద్బలంతోనే టీడీపీపైనా, సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లపైనా జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ విమర్శలు చేస్తున్నారని సబ్బం హరి అన్నారు... పార్టీ ఆవిర్భావ సభా వేదిక నుంచి బాబు, లోకేశ్‌లపై విమర్శలు గుప్పించారని, ఇదంతా బీజేపీ ప్రణాళికలో భాగమని ఆయన విశ్లేషించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా, అన్ని రాష్ట్రాల్లోను బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని మోదీ-షాలు చేస్తున్న రాజకీయ వ్యూహంలో భాగంగానే ఏపీకి ఈ కష్టాలన్నీ వచ్చాయని హరి అభిప్రాయపడ్డారు.
ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నదనే విషయంపై చర్చ సాగుతుంటే...రాజకీయ పార్టీలన్నీ దానివల్ల ఎలా లబ్ధి పొందాలనే అంశంపైనే దృష్టి సారించాయని, కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న చంద్రబాబుకు అండగా నిలవకుండా స్వప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నాయని హరి ఆవేదన వ్యక్తంచేశారు. పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు రోజుకో విధంగా ఉంటున్నాయని.. దానివల్ల ఆయన గ్రాఫ్ పడిపోయిందని సబ్బం హరి వ్యాఖ్యానించారు. మోదీపై అవిశ్వాసం పెడితే..ఢిల్లీకి వెళ్లి అందరినీ కూడగడతానని చెప్పిన ఆయన ఇప్పుడు టీడీపీ అవిశ్వాసం పెడితే..నాటకాలు ఆడుతున్నారని చెప్పడం వల్ల ప్రజల్లో పవన్‌పై నమ్మకం పోయిందన్నారు. హోదా కోసం పవన్ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తానని ఇటీవల ప్రకటించారని, అది కూడా బీజేపీ వ్యూహంలో ఒక భాగమని తనకు సమాచారం ఉందన్నారు.