మోడీ - అమిత్ షా మెడలు వంచటానికి చంద్రబాబు ఢిల్లీలో పక్కా వ్యూహంతో వెళ్తున్నారు... ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం పై, మోడీ చేస్తున్న మోసాల పై, చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెట్టించారు... దీంతో, ఒకేసారి దేశంలో ఉన్న విపక్షాలు అన్నీ, ఏకమై చంద్రబాబుకు మద్దతు తెలిపాయి... శుక్రవారం అవిశ్వాస నోటీసు ఇచ్చినా, కెసిఆర్, అన్నాడీయంకే ఎంపీల చేత ఆందోళన చేపించి, సభ వాయిదా వేసుకుని పారిపోయారు... దీంతో ఈ రోజు, అవిశ్వాస తీర్మానంపై ఎత్తుకు‌ పై ఎత్తులు వేస్తూ హీట్ పెంచుతున్నాయి, ఢిల్లీ పరిణామాలు... తెలుగుదేశం ఇప్పటికే, అవిశ్వాసానికి మద్దుతుగా 100కు పైగా ఎంపీల సంతకాలు సేకరించింది. అటు పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది.

modi 19032018 3

అవిశ్వాసంపై స్పీకర్ ఏం తేల్చబోతున్నారు. చర్చకు అనుమతిస్తారా..?. రచ్చ పేరుతో వాయిదా వేస్తారా..?. టీడీపీ అవిశ్వాసానికి విపక్షాల మద్దతుతో హీటెక్కిన సీన్. ఢిల్లీలో ఏపీ మేటర్ హీటెక్కిస్తున్నాయి. దేశం మొత్తం ఇప్పుడు టీడీపీ ప్రవేశ పెట్టిన తీర్మానం వైపు చూస్తోంది. గత శుక్రవారమే అవిశ్వాసం నోటీస్ స్పీకర్ ముందుకు వచ్చినా.. సభ సజావుగా లేదంటూ వాయిదా వేశారు. దీంతో సోమవారం మరోసారి తీర్మానం ప్రవేశపెట్టనుంది టీడీపీ. దీంతో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.

modi 19032018 2

అటు ఢిల్లీ పరిణామాలు ఏపీలోనూ హీటెక్కిస్తున్నాయి. అమరావతి కేంద్రంగా ఢిల్లీలోని పరిణామాలను గైడ్ చేస్తున్నారు సీఎం చంద్రబాబు. హస్తినలోని టీడీపీ ఎంపీలు ఇతర పార్టీలను కలిసి మద్దతు కోరుతున్నారు. ఇప్పటికే సభలో అవిశ్వాసానికి సపోర్ట్ ఇచ్చే సంఖ్య 200 వరకూ ఉంటోందని లెక్కలు గడుతోంది. ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఇప్పుడు టీడీపీ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇంత జరుగుతున్నా, రాష్ట్రంలోని విపక్షాలు మాత్రం డ్రామాలు ఆడుతూ, మోడీకి లాభం చేకూరేలా, చంద్రబాబుని బలహీన పరుస్తున్నారు....

Advertisements

Advertisements

Latest Articles

Most Read