వైసిపీ పార్టీకి చెందిన ఎంపీలు ఐదుగురు రాజీనామా చేసి నిరాహార దీక్షకు కూర్చుకున్నారు... వీళ్ళ రాజీనామాలు స్పీకర్ ఆమోదిస్తారా, లేక వీళ్ళు చేసిది అంతా బీజేపీ డైరెక్షన్ లోనా అనేది పక్కన పెడదాం... విజయసాయి రెడ్డి మాత్రం రాజీనామా చెయ్యలేదు... ఎందుకు రాజీనామా చెయ్యటం లేదో, ఇప్పటి వరకు చెప్పలేదు... సరే, రాజీనామాకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయేమో అని అనుకుందాం... వారితో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చెయ్యొచ్చుగా ? అది ఎందుకు చెయ్యరు ? దానికి ఏ సాంకేతక పరమైన అడ్డంకులు ఉండవు కదా ? జగన్ తరువాత నేనే అని చెప్పుకునే విజయసాయి రెడ్డి, మిగతా ఎంపీలతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చెయ్యరు ?
విజయసాయి రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చెయ్యటానికి చాలా ఇబ్బందులు ఉన్నాయంట... అది ఏంటో తెలుసా ? పొరపాటున, నిరాహార దీక్ష ఇలాగే కొనసాగితే, పోలీసులు వీళ్ళని ఎత్తేయక పొతే, శుక్రవారం వచ్చేస్తుంది... శుక్రవారం కోర్ట్ కి పోవాలి... ఇప్పటికే కోర్ట్, రాజకీయా కారణాలతో ఎగ్గొట్టద్దు అని చెప్పింది... అందుకే, ఎందుకు వచ్చిన గోల అనుకుని, నిరాహార దీక్షకు కూర్చోలేదు అని సమాచారం... అంతే కాదు, ఇది వరకు అయిన దానికి, కాని దానికి దీక్షకు కూర్చునే జగన్ కూడా, ఇదే కారణంతో, ఆమరణ దీక్ష చెయ్యటం లేదు అంట... ఎందుకంటే ఒకాయిన A1, ఇంకో ఆయన A2... ఇద్దరూ బెయిల్ పై బయట తిరుగుతూ, ప్రతి శుక్రవారం కోర్ట్ కి పోవాలి...అందుకే ఇలాంటి రిస్క్ లు తీసుకోవటం లేదు అంట...
మరో పక్క విజయసాయి రెడ్డి రాజీనామా చెయ్యక పోవటానికి కారణం కూడా చెప్తున్నారు... జగన్ స్వయంగా చెప్పిన విషయం ఒక ఎంపీ చెప్పారు.. "పార్లమెంట్ అయితే, మనం రాజీనామాలు ఆమోదించకుండా మ్యానేజ్ చెయ్యవచ్చు... అదే సాయన్న రాజ్యసభలో రాజీనామా చేస్తే, అక్కడ ఉన్నది వెంకయ్య నాయుడు... ఆయన మీద ఇప్పటికే మనం రాష్ట్రపతికి ఫిర్యాదు చేసాం.. అదీ ఆయన్ను మ్యానేజ్ చెయ్యటం కష్టం.. మరి, సాయన్న ఫిర్యాదు చెయ్యగానే, వెంకయ్య ఆమోదం చేస్తే, మన పరిస్థితి ఏంటి అంటూ జగన్ ప్రశ్నించారు." అని ఆ ఎంపీ చెప్పారు... అందుకే విజయసాయి రెడ్డి రాజీనామా చెయ్యలేదు అంట.. మొత్తానికి, అటు రాజీనామా చెయ్యకుండా, ఇటు ఆమరణ దీక్ష చెయ్యకుండా, ఇంతకీ విజయసాయి రెడ్డి ఎక్కడ ఉన్నాడు అంటారు ? మీరు ఊహించింది కరెక్టే... పియంఓ లోనే...