ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయం పై, కేంద్రాన్ని నిందిస్తూ, చంద్రబాబుకు మద్దతుగా జాతీయ స్థాయిలో సపోర్ట్ వస్తుంది... చంద్రబాబు ఏ విధంగా అయితే, దేశం మొత్తం, మన సమస్యల పై, మనకు అండగా నిలవాలి అనుకుని, వ్యుహ్యం పన్నారో, దానికి తగ్గట్టుగా, చంద్రబాబుకి సపోర్ట్ గా, జాతీయ స్థాయిలో మద్దతు లభిస్తుంది... ఈ వాయిస్ వినిపించింది కూడా, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పార్టీనే... మన రాష్ట్ర హక్కులనే కాదు, మోడీ వైఖరి, మిత్ర పక్షాలకు ఇస్తున్న గౌరవం గురించి కూడా ఎండగట్టారు... ఆయన ఎవరో కాదు, శిరోమణి అకాలీదళ్‌ పరి ఎంపీ నరేశ్‌ గుజ్రాల్‌... ఈయన మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ తనయుడు... ఇప్పుడు మన రాష్ట్రానికి అండగా నిలబడ్డారు...

gujral 07042018

‘‘దేశంలో మళ్లీ యునైటెడ్‌ ఫ్రంట్‌ రోజులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో చంద్రబాబు కీలక పాత్ర పోషించవచ్చు’’ అని అకాలీదళ్‌ నేత, రాజ్యసభ సభ్యుడు నరేశ్‌ గుజ్రాల్‌ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు... ‘‘ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే 2019లో కేంద్రంలో ఏర్పడేది సమాఖ్య సర్కారే. మిత్రపక్షాలను బీజేపీ నిర్లక్ష్యం చేస్తోంది. మోదీ-షా అందరినీ దూరం చేసుకుంటున్నారు. టీడీపీతోనే కాదు... మా పార్టీ పట్ల కూడా అలాగే వ్యవహరించారు’’ అని తెలిపారు. కేంద్రంలో కేవలం ఇద్దరే నిర్ణయాలు తీసుకుంటున్నారని... మిగతావారికి ఏ పాత్రా లేదని నరేశ్‌ గుజ్రాల్‌ చెప్పారు.

gujral 07042018

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి, ఉదారంగా సాయం చేసి ఉంటే తెలుగు ప్రజల దృష్టిలో మోదీ ఉన్నతంగా నిలిచేవారన్నారు... ఈ విషయాన్ని తాను స్వయంగా బీజేపీ నేతలకు చెప్పినా వారు వినిపించుకోలేదన్నారు... ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేత జగన్‌తో పోలిస్తే చంద్రబాబు ఎంతో ఉన్నత స్థానంలో ఉంటారని, జగన్‌ అవినీతి పరుడు అన్న అభిప్రాయం అందరిలో ఉందని అన్నారు. తన తండ్రి గుజ్రాల్ ని ప్రధానిగా చేయడంలో చంద్రబాబు పోషించిన పాత్రను మరువలేనని చెప్పారు... సొంత రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు నోరు మూసుకుంటే, పక్క రాష్ట్రం వారు, మన హక్కుల కై, మన ముఖ్యమంత్రికి సపోర్ట్ ఇస్తూ మాట్లాడుతున్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read