నెల రోజుల క్రితం వరకు మోడీ అనే పేరు వింటేనే చాలా మందికి హడల్... ఇప్పటికీ మన రాష్ట్రంలో కొంత మందికి హడాలే అనుకోండి... అయితే, గత నెల రోజులుగా జరుగుతున్న పరినామాలు చూస్తుంటే, చరిత్రలోనే అతి పిరికి ప్రధాన మంత్రిగా మోడీ చరిత్రలో నిలిచిపోయారు... ఈ నేపధ్యంలో, ప్రధాని మోడీ ని డీ కొట్టే మొనగాడు ఎవరంటూ, జాతీయ మీడియా టైమ్స్ అఫ్ ఇండియా ఒక సర్వే చేసింది... దీంట్లో దేశం మొత్తం సర్వేలో పాల్గున్నారు... ఈ సర్వేలో చంద్రబాబే ఛాంపియన్ అని తేల్చారు జనం... వీళ్లు కేవలం ఏపీ వాళ్లు కాదు. ఇండియా మొత్తం జరిగిన సర్వే ఇది..

times survey 07042018 1

అసలు టైమ్స్ అఫ్ ఇండియా అడిగిన ప్రశ్న ఏంటి అంటే "మోడీని ఢీ కొట్టే నాయకుడు ఎవరు ? అన్ని పార్టీలను ఏకం చేసి, బీజేపీని ఎదుర్కునే సత్తా ఎవరికి ఉంది" అని ప్రశ్న వేసింది.. ఇందులో మూడు పేర్లు ప్రధానంగా వచ్చాయ్. శరద్ పవార్, మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు.. తృణమూల్ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి 22 శాతం మద్దతు వచ్చింది. .. శరద్ పవార్ కు అనుకూలంగా 29 శాతం ఓట్లు వచ్చాయ్... చంద్రబాబు నాయుడికి మాత్రం 49 శాతం మంది మద్దతు లభించింది... మోడీని డీ కొట్టే మొనగాడు చంద్రబాబే అంటూ టైమ్స్ అఫ్ ఇండియా సర్వేలో దేశ ప్రజలు తేల్చి చెప్పారు... మొదటి స్థానానికి, రెండో స్థానానికి ఎంత తేడా ఉందో చూసారా... ఇది చంద్రబాబు సత్తా...

times survey 07042018 1

దేశ వ్యాప్తంగా చంద్రబాబుకు ఉన్న గుర్తింపు ఇది... అన్ని పార్టీలను ఏకం చేసి, ఒక్కతాటి మీదకు తీసుకువచ్చే సత్తా చంద్రబాబుకే ఉంది... ఇది, చరిత్ర కూడా చెప్తుంది... యునైటెడ్ ఫ్రంట్ దగ్గర నుంచి, ఎన్డీఏ - 1 దాకా చంద్రబాబు సారధ్యంలో ఏర్పడిన ప్రభుత్వాలే... ఇప్పుడు మోడీ అహంకారానికి, తట్టుకోలేక, దేశంలో ఉన్న విపక్షాలు అన్నీ ఏకం అవుతున్నాయి... వీరిని ఒక్కతాటి పైకి తెచ్చే క్రమంలో, దేశంలో అన్ని పార్టీలు చంద్రబాబు వంకే చూస్తున్నాయి.. గత నెల రోజులుగా, ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం విషయంలో, మోడీతో చంద్రబాబు ఎలా పోరాడుతున్నారో దేశం మొత్తం చూసింది... ఢిల్లీలో చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి, వీడియోలు, డాక్యుమెంట్ లతో సహా మోడీని ఏకిపడేసిన విధానం చూసి, మోడీని ఎదుర్కునే వాడు చంద్రబాబే అని అభిప్రాయానికి వచ్చారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read