అది ప్రపంచంలోనే నెంబర్ వన్ అంతర్జాతీయ వేదిక... ఐక్యరాజ్యసమితి చెప్తే, అమెరికా కూడా వినాల్సిందే. అలాంటి వేదిక పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గున్నారు. ఆంధ్రప్రదేశ్ కీర్తి పతాకం, అంతర్జాతీయంగా ఎగరవేశారు. ఇది ఒక్కటే కాదు, అప్పటి దాక, ఆ వేదిక పై ఇంగ్లీష్ లో అందరూ దంచి కొడుతుంటే, చంద్రబాబు టర్న్ రాగానే, స్వచ్చమైన తెలుగులో ప్రసంగం మొదలు పెట్టారు. "భారతీయలు అందరి తరుపున, తెలుగు వారి అందరి తరుపున నన్ను ఇక్కడకు ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకృతి వ్యవసాయంలో ప్రపంచానికి ఆదర్శం" అని తెలుగులో సంభోదించి, ఇలాంటి అరుదుగే, ప్రపంచ వేదిక పై ప్రసంగించే అవకాసం నాకు, నా రాష్ట్రానికి రావటంతో, నేను ఒక రెండు నిమషాలు నా మాతృ భాషలో మాట్లాడాను అని చెప్పి, ఆయన ప్రసంగం మొదలు పెట్టారు.

cbn un 25092018 2

చంద్రబాబు ఐక్యరాజ్య సమితిలో పలికిన తొలి పలుకులు వింటుంటే, అంతర్జాతీయ వేదికల మీద దేశదేశాల దిగ్గజాల మధ్య మన తెలుగు వింటుంటే ఒక అనిర్వచనీయమైన ఆనందం. ఆ సమయంలో పార్టీలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా, ప్రతి తెలుగు వాడి ఛాతీ గర్వంతో ఉప్పొంగే క్షణాలు అవి, ‘జీవితం సార్ధకం’ అనిపించే సంఘటన ఈ సన్నివేశం. 'సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత...అంతర్జాతీయ సవాళ్లు- అవకాశాలు' అనే అంశంపై చంద్రబాబు ప్రసంగం కొనసాగింది. కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ భారతీయుల తరపున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ నేడు ప్రకృతి వ్యవసాయానికి కేంద్రంగా మారిందని, ఇది ప్రపంచానికే ఆదర్శం అని బాబు తన ప్రసంగాన్ని ఆరంభించారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యం అమలుతీరును సీఎం చంద్రబాబు వివరించారు.

cbn un 25092018 3

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఇప్పటికే లక్షల ఎకరాల్లో సాగయ్యేలా చేయడం, 2029 నాటికి 20 లక్షల ఎకరాలకు ఈ విస్తీర్ణాన్ని పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించారు. పైసా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి అమెరికన్‌ సాంకేతికత, మేథో పరిజ్ఞానాన్ని జోడించేందుకు పరస్పర సహాయ సహకారాలపై ఆయన చర్చించారు. ఇప్పటికే దేశంలో ప్రకృతి సేద్యంలో నవ్యాంధ్ర అగ్రగామిగా ఎదిగి సాధిస్తున్న విజయాలను వివరించారు. ఈ సమావేశంలో కీలక ప్రసంగాలు చేసిన తొమ్మిది మందిలో చంద్రబాబు ఒకరు కావడం విశేషం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read