ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని, అన్ని విధాల సహకరిస్తామని ఎన్‌ఆర్ఐలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం న్యూయార్క్‌లో ఎన్‌ఆర్‌ఐల బహిరంగ సభ ప్రసంగించారు. "తెలుగువారంతా వ్యవసాయ రంగంలోనే కాదు, నాలెడ్జి ఎకానమీలో మీరంతా ముందుకు రావాలని ఆకాంక్షించాను. ఏం చేస్తే మనవాళ్లకు భవిష్యత్తు ఉంటుందో ఆరోజు అమెరికాలో ప్రవాసాంధ్రులతో సమాలోచనలు చేశాను. నాలెడ్జి ఎకానమీకి హైదరాబాద్ లో మొట్టమొదటి జ్ఞాపక చిహ్నంలా, గురుతుగా సైబర్ టవర్స్ నిర్మించాం. సరిగ్గా ఇరవై ఏళ్ల నాడు ఇదే రోజు సైబర్ టవర్స్ ప్రారంభమైంది. అంటే మన జైత్రయాత్ర ఇరవై ఏళ్ల కంటే ముందు ప్రారంభమైంది. ఆ రోజు ఇంజనీరింగ్ కళాశాల సంఖ్య 25 నుంచి 30 మాత్రమే. నాలెడ్జి ఎకానమీలో భాగంగా, మా ప్రోత్సాహంతో 250 ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటయ్యాయి."

cbn udsa 24092018 2

"ఈ రెండింటితోనే ఐటీ విప్లవం ముందుకు సాగినట్లు కాదని భావించాను. అమెరికా వచ్చి పదిహేను రోజులు ఉన్నాను. పెద్ద పెద్ద ఐటీ కంపెనీల సీఈఓలతో, పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యాను. మా దగ్గర పుష్కల మానవ వనరులున్నాయి. మీరు వచ్చి కంపెనీలు పెట్టండి అని విజ్ఞప్తి చేశాను. వారిని ఒప్పించాను. జీవితంలో మొదటి సారి మన రాష్ట్రం దేశం వదలి 15 రోజులు అమెరికాలో ఉన్నాను. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ ‌గేట్స్ అపాయింట్ మెంట్ అడిగితే ఆయన రాజకీయ నాయకులతో నాకేమీ పనిలేదని చెప్పారు. కాదు. కాదు నాకు మీతో పని ఉందని బిల్ గేట్స్ ను ఒప్పించాను. ఎట్టకేలకు పది నిమిషాలపాటు నాతో మాట్లాడేందుకు అంగీకరించి అపాయింట్ మెంట్ ఇచ్చారు బిల్‌గేట్స్. ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగ అభివృద్ధికి అవకాశాలు, అక్కడ మౌలిక సదుపాయాలపై నేనిచ్చిన ప్రజెంటేషన్ నలభై ఐదు నిమిషాలు కొనసాగింది. అమెరికా దాటి మైక్రోసాఫ్ట్ తన సంస్థ కార్యాలయం ఏర్పాటు చేస్తే అదీ భారత్ లో ఏర్పాటు చేస్తే హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని బిల్ గేట్స్ ని కోరాను. అలా హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ వచ్చింది. ఆరోజు నాది ఒక స్వప్నం. నేడు నిజం. ఐటీ విప్లవ ఫలాలు అందుకుని ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను"

cbn udsa 24092018 3

"నేను కూడా రైతు కుటుంబంలో పుట్టాను. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ కార్యాలయం హైదరాబాద్ కు రావాలని కోరుకున్నాను. ఇవాళ అదే మైక్రోసాఫ్ట్ సీఈఓగా మన తెలుగు బిడ్డ ఉన్నారు. అదీ మన సత్తా. మన తెలివి తేటలు. మీరు రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి కష్టపడి పనిచేయాలి. రెండోది జన్మభూమిని మరచిపోకూడదు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మీరు మనుగడ సాగించే సామర్ధ్యాన్ని, నైపుణ్యాన్నిసంపాదించారు. ఎక్కడైనా సర్దుకుపోగలిగే అడాప్టబిలిటీ మీలో చాలా ఉంది. అందుకు మీకు నా అభినందనలు. ఇక్కడి పౌరులతో మీరు పాలై-నీళ్లలా కలసి పోవాలి. రాజకీయాలలో సహకరించాలి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. శ్రమదానం చేయండి. సామాజిక కార్యక్రమాలకు సహకరించండి." అని అన్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read