దేశభక్తికి నిలువెత్తు నిదర్శనమైన గణతంత్ర వేడుకల మాటున దేశ రక్షణలో అత్యంత కీలకమైన యుద్ధ విమానాల కొనుగోలు పేరిట ఫ్రెండుకు మేలు చేయడానికి ఒకరు, గర్ల్‌ఫ్రెండ్‌కి లబ్ధి చేకూర్చడానికి మరొకరు ఒప్పందాలు చేసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. 2016 జనవరి 26న, భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా అప్పటి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫాన్స్‌ హోలాంద్‌ హాజరయ్యారు. అనంతరం, కొద్దిసేపటికే 36 రాఫెల్‌ విమానాల కొనుగోలుకు అవగాహన ఒప్పందం పై హోలాంద్‌, మోదీ సంతకాలు చేశారు. రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందంగా దీనిని అభివర్ణించారు.

rafael 24092018 1

కానీ, అంతకు రెండు రోజుల ముందే హోలాంద్‌ ప్రియురాలు, నటి జూలియా గయెట్‌ నిర్మించే ఫ్రెంచి సినిమాకు పెట్టుబడి పెట్టేందుకు అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఒప్పందం కుదుర్చుకుంది. సినిమా బడ్జెట్‌ కోటి యూరోలు (మన రూపాయల్లో దాదాపు 90 కోట్లు.) ఈ సినిమా కోసం 30 లక్షల యూరోలు ‘పైనాన్స్‌’ చేస్తామని రిలయన్స్‌ తెలిపింది. ఈ నేపథ్యంలోనే, రాఫెల్‌ డీల్‌లో క్విడ్‌ ప్రో కో ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హోలాంద్‌ ప్రియురాలి సినిమాకు అనిల్‌ అంబానీ పెట్టుబడి పెట్టారు. ఆ వెంటనే, హోలాంద్‌, మోదీ కుదుర్చుకున్న రాఫెల్‌ డీల్‌లో ఆయన ఆఫ్‌ సెట్‌ భాగస్వామిగా తెరపైకి వచ్చారు. దాంతో, అనిల్‌ అంబానీ, హోలాంద్‌ కుమ్మక్కయ్యారని, ఇందుకు మోదీ సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

rafael 24092018 1

రాఫెల్‌ ఒప్పందం క్విడ్‌ ప్రో కో అని విమర్శిస్తూ ఒప్పందంలో మార్పులు జరిగిన తీరు, పరిణామాలను కాంగ్రెస్‌ వివరిస్తోంది. యూపీఏ హయాంలో ఫ్రాన్స్‌కు చెందిన దసో ఏవియేషన్‌ నుంచి 126 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు ఎంవోయూ కుదుర్చుకున్నారు. అది కుదిరి ఉంటే, రాఫెల్‌ విమానాలను భారత్‌లోనే ప్రభుత్వ రంగ సంస్థ ‘హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌’ (హెచ్‌ఏఎల్‌) తయారు చేసి ఉండేది. కానీ, ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో ప్రధాని మోదీ ఆ ఒప్పందాన్ని రద్దు చేశారు. దసో నుంచి కేవలం 36 రాఫెల్‌ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ప్రకటించారు. 2016 సెప్టెంబరు 23వ తేదీన ఇరు దేశాల రక్షణ మంత్రులు ఢిల్లీలోనే రూ.59 వేల కోట్ల ఒప్పందం పై సంతకం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read